Telugu Global
Cinema & Entertainment

సల్మాన్ నోరు జారాడు... తండ్రి క్షమాపణ కోరాడు...

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు వివాదాలేమీ కొత్త కాదు. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకుని కోర్టుల చుట్టూ, జైళ్ల చుట్టూ తిరిగిన సల్మాన్ తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో నోరుజారి మరో కొత్త వివాదానికి వెల్కమ్ చెప్పాడు. ఆ వివరాలలోకి వెళితే, సల్మాన్ తన లేటెస్ట్ మూవీ ‘సుల్తాన్’ కోసం రెజ్లర్ గా నటించడానికి పడ్డ కష్టాన్ని వివరిస్తూ.. ‘ఓ సీన్ బాగా చేయడం కోసం ఆరు గంటల […]

సల్మాన్ నోరు జారాడు... తండ్రి క్షమాపణ కోరాడు...
X
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు వివాదాలేమీ కొత్త కాదు. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకుని కోర్టుల చుట్టూ, జైళ్ల చుట్టూ తిరిగిన సల్మాన్ తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో నోరుజారి మరో కొత్త వివాదానికి వెల్కమ్ చెప్పాడు.
ఆ వివరాలలోకి వెళితే, సల్మాన్ తన లేటెస్ట్ మూవీ ‘సుల్తాన్’ కోసం రెజ్లర్ గా నటించడానికి పడ్డ కష్టాన్ని వివరిస్తూ.. ‘ఓ సీన్ బాగా చేయడం కోసం ఆరు గంటల సమయం నరకంలా అనిపించింది. ఆ సీన్ లో 120 కిలోల వ్యక్తిని అమాంతం పైకెత్తి మళ్లీ కిందకు పడేయాలి. ఇది చాలాసార్లు చాలా రకాలుగా చేయాల్సి వచ్చింది. నిజమైన రెజ్లర్ కు కూడా ఒకరోజులో అవతలి వ్యక్తిని అన్నిసార్లు ఎత్తాల్సిన అవసరం ఉండదు. షూటింగ్ అంతా అయ్యే సరికి నా పరిస్థితి రేప్ అయిపోయిన అమ్మాయిలా అయిపోయింది. కనీసం తిన్నగా నడవలేకపోయాను’ అంటూ సల్మాన్ ఖాన్ నోరుజారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
దీనిపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. జాతీయ మహిళా కమిషన్ అయితే సల్మాన్ వ్యాఖ్యల్ని సుమోటాగా తీసుకొని విచారణ ప్రారంభించింది. మరోపైపు దిల్లీలో నిర్భయ తల్లి కూడా దీనిపై ఆందోళన ఉధృతం చేశారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో కూడా సల్మాన్ కామెంట్స్ పై తీవ్ర దుమారం చెలరేగుతోంది. దీంతో సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ రంగంలోకి దిగారు. తన కొడుకు చేసిన వ్యాఖ్యలు తప్పేనని, కావాలని ఆ వ్యాఖ్యలు చేయలేదని… ఫ్లోలో అలా మాట్లాడేశాడని క్షమించాలని కోరుకున్నాడు. స్టార్ హోదాలో ఉన్న హీరో ఫ్లోలో ఏది పడితే అది మాట్లాడితే ఇలానే ఉంటుంది మరి.
First Published:  21 Jun 2016 10:46 PM GMT
Next Story