Telugu Global
NEWS

చ‌ల‌ప‌తిరావు చెలికాడినే మ‌నువాడ‌తాడ‌ట‌!

వినేందుకు, చ‌ద‌వడానికి ఇబ్బందిగా.. ఎబ్బెట్టుగా ఉన్నా ఇది వాస్త‌వం. పేరు చూస్తే తెలుగువాడిలా ఉంద‌నుకుంటున్నారా?  నిజ‌మే! చ‌లిప‌తిరావు మ‌న తెలుగువాడే. ఇత‌ను మ‌రో పురుషుడిని పెళ్లి చేసుకునేందుకు స‌ర్వం సిద్ధం చేశాడు. ఇందుకు ఇంట్లోవారిని సైతం ఒప్పించాడు. ఇదేం చోద్యంరా నాయ‌నా? ఒక మ‌గాడు..మ‌రో మ‌గాడిని ఎలా పెళ్లి చేసుకుంటున్నాడు.. అందుకు ఆయ‌న త‌ల్లిదండ్రులు ఎలా ఒప్పుకున్నారు? అన్న ప్ర‌శ్న‌లు మీ మ‌న‌సులో చెల‌రేగుతున్నాయి క‌దా..! అయితే.. ఇది చ‌ద‌వాల్సిందే! విశాఖ‌ప‌ట్నానికి చెందిన చ‌ల‌ప‌తిరావు (22) కుటుంబం […]

చ‌ల‌ప‌తిరావు చెలికాడినే మ‌నువాడ‌తాడ‌ట‌!
X
వినేందుకు, చ‌ద‌వడానికి ఇబ్బందిగా.. ఎబ్బెట్టుగా ఉన్నా ఇది వాస్త‌వం. పేరు చూస్తే తెలుగువాడిలా ఉంద‌నుకుంటున్నారా? నిజ‌మే! చ‌లిప‌తిరావు మ‌న తెలుగువాడే. ఇత‌ను మ‌రో పురుషుడిని పెళ్లి చేసుకునేందుకు స‌ర్వం సిద్ధం చేశాడు. ఇందుకు ఇంట్లోవారిని సైతం ఒప్పించాడు. ఇదేం చోద్యంరా నాయ‌నా? ఒక మ‌గాడు..మ‌రో మ‌గాడిని ఎలా పెళ్లి చేసుకుంటున్నాడు.. అందుకు ఆయ‌న త‌ల్లిదండ్రులు ఎలా ఒప్పుకున్నారు? అన్న ప్ర‌శ్న‌లు మీ మ‌న‌సులో చెల‌రేగుతున్నాయి క‌దా..! అయితే.. ఇది చ‌ద‌వాల్సిందే!
విశాఖ‌ప‌ట్నానికి చెందిన చ‌ల‌ప‌తిరావు (22) కుటుంబం కొన్నేళ్ల క్రితం మ‌లేసియా వెళ్లి స్థిర‌ప‌డ్డారు. అక్క‌డే పెరిగి పెద్ద‌యిన చ‌ల‌ప‌తిరావు కు ఆధ్యాత్మిక చింత‌న ఎక్కువ‌. ఇత‌నికి ఫేస్‌బుక్ లో అమెరికాకు చెందిన జాన్ మెకాకేనే తో ప‌రిచ‌యం అయ్యాడు. ఇద్ద‌రి మ‌నోభావాలు, అభిప్రాయాలు క‌లిశాయి. కొంత‌కాలం ప్రేమ‌లో ప‌డ్డారు. త‌రువాత పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. విష‌యం తెలుసుకున్న చ‌ల‌ప‌తిరావు త‌ల్లిదండ్రులు త‌మ కొడుకు ప‌రిస్థితిపై ఆందోళ‌న చెందారు. తొలుత వ్య‌తిరేకించినా.. త‌రువాత అన్య‌మ‌న‌స్కంగానే అంగీక‌రించారు. అందుకే, ద‌క్షిణ భార‌త‌దేశ సంప్ర‌దాయం ప్ర‌కారం.. వీరి ఎంగేజ్‌మెంట్ ఘ‌నంగా నిర్వ‌హించారు. త్వ‌ర‌లోనే వీరి వివాహం ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది.
First Published:  21 Jun 2016 9:00 PM GMT
Next Story