Telugu Global
NEWS

చార్జీల మోత‌పై ప్ర‌తిప‌క్షాల‌ వ్యూహమేంటి?

ఇంత‌కాలం ప్ర‌భుత్వాన్ని ఏ ఒక్క విష‌యంలోనూ స‌మ‌ర్థంగా ఎదుర్కోలేక‌పోయిన ప్ర‌తిప‌క్షాల‌కు చాలాకాలం త‌రువాత బ‌ల‌మైన ఆయుధం దొరికింది. తెలంగాణ విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీల పెంపున‌కు సీఎం కేసీఆర్ ప‌చ్చ‌జెండా ఊపారు.  ఈ పెంపులో పేద‌లు, సామాన్యులు ఇబ్బందులు ప‌డ‌కుండా.. కొన్ని సూచ‌న‌లు చేశారు. ఆర్టీసీలో ప‌ల్లెవెలుగులో రూ.30 కిమీల వ‌ర‌కు ఒక‌రూపాయి, త‌రువాత ఎంత దూరం ప్ర‌యాణించినా రూ.2లు అదనంగా వ‌సూలు చేయాల‌న్నారు. అయితే ఎక్స్‌ప్రెస్‌, ల‌గ్జ‌రీల పెంపు విష‌యంలో అధికారుల‌కు కాస్త వెసులుబాటు క‌ల్పించారు. అలాగే […]

చార్జీల మోత‌పై ప్ర‌తిప‌క్షాల‌ వ్యూహమేంటి?
X
ఇంత‌కాలం ప్ర‌భుత్వాన్ని ఏ ఒక్క విష‌యంలోనూ స‌మ‌ర్థంగా ఎదుర్కోలేక‌పోయిన ప్ర‌తిప‌క్షాల‌కు చాలాకాలం త‌రువాత బ‌ల‌మైన ఆయుధం దొరికింది. తెలంగాణ విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీల పెంపున‌కు సీఎం కేసీఆర్ ప‌చ్చ‌జెండా ఊపారు. ఈ పెంపులో పేద‌లు, సామాన్యులు ఇబ్బందులు ప‌డ‌కుండా.. కొన్ని సూచ‌న‌లు చేశారు. ఆర్టీసీలో ప‌ల్లెవెలుగులో రూ.30 కిమీల వ‌ర‌కు ఒక‌రూపాయి, త‌రువాత ఎంత దూరం ప్ర‌యాణించినా రూ.2లు అదనంగా వ‌సూలు చేయాల‌న్నారు. అయితే ఎక్స్‌ప్రెస్‌, ల‌గ్జ‌రీల పెంపు విష‌యంలో అధికారుల‌కు కాస్త వెసులుబాటు క‌ల్పించారు. అలాగే విద్యుత్ చార్జీల విషయంలో 100 యూనిట్లు దాటిన వినియోగ‌దారులపై మాత్రం బాదుడుకు అనుమ‌తించారు.
తెలంగాణ‌లో ప్ర‌భుత్వాన్ని ఎదుర్కోవ‌డంలో, ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్ట‌డంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కులు స‌ఫలీకృతం కాలేక‌పోతున్నారు. కాంగ్రెస్ లో అనైక్య‌త‌, తెలుగుదేశంలో నాయ‌కుల కొర‌త వెర‌సి ఇక్క‌డ ప్ర‌భుత్వాన్ని నిల‌దీసేందుకు స‌రైన ప్ర‌త్యామ్నాయం లేకుండా పోయింది. ఇటీవ‌ల మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ భూనిర్వాసితుల‌పై ప్ర‌తిప‌క్షాలు స‌రిగా పోరాడ‌లేక‌పోయాయ‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. అయితే, ఈ తంతు అప్పుడే ముగియ‌లేదు. భూ నిర్వాసితుల ప‌రిహారం విష‌యంలో మాత్రం ప్ర‌తిపక్షాలు వెన‌క్కి త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలో పోరాటాన్ని మ‌రింత ఉద్ధృతం చేసేందుకు ప్రణాళిక‌లు రూపొందిస్తున్నారు.
మ‌ల్ల‌న్న సాగ‌ర్‌పై ఎంతో కొంత.. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నంలో ఉన్న ప్ర‌తిపక్షాల‌కు ఛార్జీల పెంపు నిర్ణ‌యం మ‌రో ఆయుధంలా మార‌నుంది. దీనిపై స‌రైన వ్యూహాల‌తో ముందుకెళితే.. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను కొంత‌లో కొంత ఆపిన‌వార‌వుతారు. ఎన్నిక‌లు ముగియ‌గానే.. ఛార్జీల మోత మోగించ‌బోతున్నారంటూ ప్ర‌భుత్వంపై సంధించేందుకు విమ‌ర్శ‌నాస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్ర‌భుత్వం త‌మ నిర్ణ‌యాన్ని ఎలా స‌మ‌ర్ధించుకుంటుందో ఆస‌క్తిక‌రంగా మారింది.
First Published:  22 Jun 2016 8:01 PM GMT
Next Story