Telugu Global
National

మోడీ చ‌దువు త‌రువాత‌...ఇప్పుడు కేజ్రీవాల్ వంతు!

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ విద్యార్హ‌త‌లపై వివాదం త‌రువాత ఇప్పుడు కేజ్రీవాల్ వంతు వ‌చ్చింది. న‌రేంద్ర‌మోడీ విద్యార్హ‌త‌ల వివ‌రాలు కావాలంటూ కేజ్రీవాల్ ప‌లుర‌కాల ప్ర‌య‌త్నాలు  చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ఢిల్లీలోని స‌మాచార క‌మిష‌న‌ర్‌కే ఈ విష‌యంపై లేఖ రాశారు. ఆ త‌రువాత మోడీ విద్యార్హ‌త‌ల‌పై ఆర్‌టిఐ కార్యాల‌యానికి ఇత‌రుల నుండి కూడా ద‌ర‌ఖాస్తులు వెళ్లాక బిజెపి అధ్య‌క్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీలు…ఇవీ ప్ర‌ధాని విద్యార్హ‌త‌లు అంటూ వివ‌రాలు వెల్ల‌డించారు. ఇప్పుడు బిజెపి కేజ్రీవాల్‌ని ఇదే […]

మోడీ చ‌దువు త‌రువాత‌...ఇప్పుడు కేజ్రీవాల్ వంతు!
X

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ విద్యార్హ‌త‌లపై వివాదం త‌రువాత ఇప్పుడు కేజ్రీవాల్ వంతు వ‌చ్చింది. న‌రేంద్ర‌మోడీ విద్యార్హ‌త‌ల వివ‌రాలు కావాలంటూ కేజ్రీవాల్ ప‌లుర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ఢిల్లీలోని స‌మాచార క‌మిష‌న‌ర్‌కే ఈ విష‌యంపై లేఖ రాశారు. ఆ త‌రువాత మోడీ విద్యార్హ‌త‌ల‌పై ఆర్‌టిఐ కార్యాల‌యానికి ఇత‌రుల నుండి కూడా ద‌ర‌ఖాస్తులు వెళ్లాక బిజెపి అధ్య‌క్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీలు…ఇవీ ప్ర‌ధాని విద్యార్హ‌త‌లు అంటూ వివ‌రాలు వెల్ల‌డించారు.

ఇప్పుడు బిజెపి కేజ్రీవాల్‌ని ఇదే విష‌యంమీద టార్గెట్ చేసింది. బిజెపి నేత సుబ్ర‌మ‌ణ్య స్వామి కేజ్రీవాల్‌కి ఐఐటిలో సీటెలా వ‌చ్చిందో త‌న‌కు తెలియాలంటున్నారు. కేజ్రీవాల్ 1980లో ఖ‌ర‌గ్‌పూర్ ఐఐటిలో మెకానిక‌ల్ ఇంజినీరింగ్ లో బీటెక్ హాన‌ర్స్ చ‌దివారు. కేజ్రీవాల్‌కి జాతీయ‌స్థాయిలో జెఈఈ లాంటి ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ల్లో ఎంత ర్యాంకు వ‌చ్చిందో, ఆయ‌న‌కు ఖ‌ర‌గ్‌పూర్ ఐఐటిలో సీటెలా వ‌చ్చిందో తెలుసుకునేందుకు తాను ఆర్‌టిఐ చ‌ట్టం ద్వారా ద‌ర‌ఖాస్తు చేశాన‌ని సుబ్ర‌మ‌ణ్య‌స్వామి అన్నారు. అయితే ఆ స‌మాచారం త‌మ వ‌ద్ద లేద‌ని త‌న‌కు ఐఐటి నుండి స‌మాధానం వ‌చ్చింద‌ని సుబ్ర‌మ‌ణ్య‌స్వామి పేర్కొన్నారు. ఆర్‌బిఐ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురాజ‌న్ త‌రువాత ఢిల్లీ ముఖ్య‌మంత్రిని వెంట‌ప‌డ‌తాన‌ని ముందే చెప్పిన స్వామి ఇప్పుడు అదే ప‌నిలో ఉన్నారు.

First Published:  23 Jun 2016 11:07 PM GMT
Next Story