Telugu Global
Cinema & Entertainment

సూర్య నుంచి మరో సినిమా వస్తోంది...

ఈమధ్యే సూర్య నటించిన 24 సినిమా వచ్చింది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి హిట్ అందుకుంది ఈ సినిమా. ఇప్పుడు సూర్య నుంచి మేము పేరుతో మరో సినిమా రాబోతోంది. అమలాపాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను జులై 1న విడుదల చేయాలని నిర్ణయించారు. పసంగ-2 పేరుతో తమిళ్ లో హిట్టయిన ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో డబ్ చేస్తున్నారు. నిజానికి ఈ ప్రయోగాత్మక సినిమా ఎప్పుడో తెలుగులో విడుదల కావాల్సి ఉంది. […]

సూర్య నుంచి మరో సినిమా వస్తోంది...
X
ఈమధ్యే సూర్య నటించిన 24 సినిమా వచ్చింది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి హిట్ అందుకుంది ఈ సినిమా. ఇప్పుడు సూర్య నుంచి మేము పేరుతో మరో సినిమా రాబోతోంది. అమలాపాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను జులై 1న విడుదల చేయాలని నిర్ణయించారు. పసంగ-2 పేరుతో తమిళ్ లో హిట్టయిన ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో డబ్ చేస్తున్నారు. నిజానికి ఈ ప్రయోగాత్మక సినిమా ఎప్పుడో తెలుగులో విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను జులై 1న విడుదల చేస్తామంటూ మరో డేట్ ఎనౌన్స్ చేశారు. ప్రముఖ దర్శకుడు పాండిరాజ్ రూపొందించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ ను “స్టూడియో గ్రీన్ జ్ఞాన్ వేల్ రాజాతో కలిసి.. తన సొంత నిర్మాణ సంస్థ “2 డి ఎంటర్ టైన్మెంట్స్” పతాకంపై.. సూర్య స్వయంగా సమర్పింస్తుండడం విశేషం. సూర్యతో పాటు జూలకంటి మధుసూధనరెడ్డి ఈ సినిమాకు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా కూడా తెలుగులో హిట్టయితే ఈ ఏడాది వరుసగా టాలీవుడ్ లో రెండు విజయాలు అందుకున్న తమిళ స్టార్ గా సూర్య రికార్డు సృష్టిస్తాడు. అయితే ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం, తెలుగు ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పిస్తుందనేది చూడాలి.
First Published:  24 Jun 2016 9:29 PM GMT
Next Story