త్యాగాలు చేసే ఓపిక లేదు

చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమకు తీరని ద్రోహం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అంజాద్‌ బాషా విమర్శించారు. కడపలో మీడియాతో మాట్లాడిన వారు ఇప్పటికే కృష్ణా జలాలను, రాజధానిని రాయలసీమ నుంచి తరలించుకుపోయారన్నారు. ఇంకా త్యాగాలు చేస్తూ బతికే ఓపిక రాయలసీమ ప్రజలకు లేదన్నారు. ప్రస్తుతం నూతన రాజధానికి తరలిస్తున్న సచివాలయ ఉద్యోగుల్లో రాయలసీమ ఉద్యోగుల వాటా ఎంతో తేల్చాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. సచివాలయంలో రాయలసీమ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం చేపట్టే కొత్త నియమాకాల్లో రాయలసీమ హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు చంద్రబాబు ఇదే తరహాలో అన్యాయం చేస్తూపోతే మరో ఉద్యమానికి ఉతమిచ్చిన వారవుతారని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు.

Click on Image to Read:

jagan-ches

brahmin-swis

chandrababu

chandrababu-insult

dk-aruna

YSR

mysura-reddy-teja-cement-fa

Alla-Ramakrishna-Reddy

babu

kommineni-comments-1

kommineni-ys-jagan

YS-Jagan-London-tour

galla-jayadev

ap-capital

chandrabau-vijayanand

ysrcp-krishnadistrict

karanam-balaram-vs-chandrab

bhumana-karunakar-reddy

ap-krishna-pushkaras-3d-des

ap-dairy

ysrcp