Telugu Global
Cinema & Entertainment

కూడబలుక్కొని మరీ కొల్లగొట్టిన దీపిక, ప్రియాంక

ఇద్దరూ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్స్ అయిపోయారు. హాలీవుడ్ నటీనటులతో కలిసి నటిస్తున్నారు. ఇలాంటి భామలతో స్టేజ్ పెర్ ఫార్మెన్స్ ఇప్పిస్తే… అంతర్జాతీయ స్థాయిలో ఈవెంట్ కు గుర్తింపు రావడం ఖాయం. ఇంటర్నేషనల్ మీడియా కూడా కవర్ చేస్తుంది. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు దీపిక పదుకోన్, ప్రియాంక చోప్రా. ఇద్దరూ కలిసికూర్చొని, చర్చించుకొని మరీ… స్టేజ్ షోకు రేటు ఫిక్స్ చేసుకున్నారు. బాలీవుడ్ అవార్డ్స్ కార్యక్రమం-ఐఐఎఫ్ఏను ఈసారి స్పెయిన్ లో నిర్వహించేందుకు రంగం […]

కూడబలుక్కొని మరీ కొల్లగొట్టిన దీపిక, ప్రియాంక
X
ఇద్దరూ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్స్ అయిపోయారు. హాలీవుడ్ నటీనటులతో కలిసి నటిస్తున్నారు. ఇలాంటి భామలతో స్టేజ్ పెర్ ఫార్మెన్స్ ఇప్పిస్తే… అంతర్జాతీయ స్థాయిలో ఈవెంట్ కు గుర్తింపు రావడం ఖాయం. ఇంటర్నేషనల్ మీడియా కూడా కవర్ చేస్తుంది. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు దీపిక పదుకోన్, ప్రియాంక చోప్రా. ఇద్దరూ కలిసికూర్చొని, చర్చించుకొని మరీ… స్టేజ్ షోకు రేటు ఫిక్స్ చేసుకున్నారు. బాలీవుడ్ అవార్డ్స్ కార్యక్రమం-ఐఐఎఫ్ఏను ఈసారి స్పెయిన్ లో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఇక అక్కడి ప్రజలు ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే లను చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారట. దీంతో ఎలాగైనా వీరిచేత డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ లు ఇప్పించాలని ఫిక్స్ అయిన నిర్వహకులు… వారితో పేమెంట్స్ విషయమై మాట్లాడారు. ఈ సందర్బంగా దీపికా పదుకునే తనకు ఒక్కో నిమిషానికి రూ. 33 లక్షల చొప్పున పేమెంట్ ఇస్తే డ్యాన్స్ చేస్తానని తేల్చి చెప్పేసిందట. దీంతో ఒక పాటకు గాను 1.32 కోట్ల రూపాయలు మొత్తం చెల్లించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ప్రియాంక చోప్రా కూడా సేమ్ టూ సేమ్ ఇంతే మొత్తాన్ని డిమాండ్ చేసిందట. ఇద్దరూ కలిసిపోవడంతో చేసేది లేక అడిగినంత సమర్పించుకోవడానికి నిర్వహకులు సిద్ధమయ్యారు.
First Published:  25 Jun 2016 9:16 PM GMT
Next Story