Telugu Global
Cinema & Entertainment

రోజులు మారాయి అంటున్న దిల్ రాజు

చిన్న సినిమాల్లో ఏమాత్రం సరకు ఉన్నా ఒడిసిపట్టుకోవడం దిల్ రాజుకు వెన్నతో పెట్టిన విద్య. చిన్న సినిమాల్లో ఆడే సత్తా ఉన్న మూవీస్ ను దిల్ రాజు ఇట్టే పట్టేస్తాడు. అలాంటి సినిమాల్ని తక్కువ రేటుకు కొని, తన డిస్ట్రిబ్యూషన్ మేజిక్కులతో ఎక్కువ లాభాలు ఆర్జిస్తుంటాడు. ఇన్నాళ్లూ రాజుగారు ఫాలో అయిన టెక్నిక్ ఇదే. అందుకే బడా సినిమాలకు ఆయన బాగా దూరమైపోయాడు. తాజాగా దిల్ రాజు, రోజులు మారాయ్ అనే మరో సినిమా రైట్స్ కూడా […]

రోజులు మారాయి అంటున్న దిల్ రాజు
X
చిన్న సినిమాల్లో ఏమాత్రం సరకు ఉన్నా ఒడిసిపట్టుకోవడం దిల్ రాజుకు వెన్నతో పెట్టిన విద్య. చిన్న సినిమాల్లో ఆడే సత్తా ఉన్న మూవీస్ ను దిల్ రాజు ఇట్టే పట్టేస్తాడు. అలాంటి సినిమాల్ని తక్కువ రేటుకు కొని, తన డిస్ట్రిబ్యూషన్ మేజిక్కులతో ఎక్కువ లాభాలు ఆర్జిస్తుంటాడు. ఇన్నాళ్లూ రాజుగారు ఫాలో అయిన టెక్నిక్ ఇదే. అందుకే బడా సినిమాలకు ఆయన బాగా దూరమైపోయాడు. తాజాగా దిల్ రాజు, రోజులు మారాయ్ అనే మరో సినిమా రైట్స్ కూడా తీసుకున్నాడు. మారుతి ఈ సినిమాకు నిర్మాత కావడం, దిల్ రాజు సమర్పిస్తుండడంతో… రోజులు మారాయ్ అనే చిన్న సినిమా ఇప్పుడు జనాల నోళ్లల్లో బాగానే నానుతోంది. మారుతి టాకీస్ బ్యాన‌ర్ లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స‌హ‌-నిర్మాణం లో రూపొందిస్తున్న చిత్రం రోజులు మారాయి. జి.శ్రీనివాస‌రావు నిర్మిస్తున్నఈ చిత్రంతో ముర‌ళీ కృష్ణ ముడిదాని ద‌ర్శ‌కుడు. చేత‌న్‌ మద్దినేని, పార్వతీశ‌మ్‌, కృతిక‌, తేజ‌స్వి ముఖ్యపాత్రల్లో న‌టిస్తున్నారు. ఈరోజుల్లో, బ‌స్టాప్‌, ప్రేమ‌క‌థాచిత్రమ్ లాంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌కి సంగీతాన్ని అందించిన జె.బి ఈ చిత్రానికి సంగీతం అందించాడు. సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకొని U/Aస‌ర్టిఫికేట్ తో జులై 1న విడుద‌ల కానుంది ఈ సినిమా. దిల్ రాజు చేతిలో పడిన ఈ చిన్న సినిమా… ఏ మేరకు వసూళ్లూ రాబడుతుందో చూడాలి.
First Published:  25 Jun 2016 9:19 PM GMT
Next Story