అమావాస్య, పౌర్ణమినాడు ఉమ అందుకే విచిత్రంగా ప్రవర్తిస్తాడట…

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ పనితీరుపై వైసీపీ నాయకుడు జోగి రమేష్‌ తీవ్ర విమర్శలు చేశారు. వరుణదేవుడు దయతలిస్తే గానీ సొంతనియోజకవర్గానికి కూడా నీరు ఇవ్వలేని దద్దమ్మ దేవినేని ఉమా అని జోగి రమేష్ విమర్శించారు. దేవినేని ఉమకు చిన్నప్పుడే పిచ్చికుక్క కరిచిందని అందుకే అమావాస్య, పౌర్ణమి రోజుల్లో విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడని చెప్పారు. దేవినేని ఉమ లాంటి అజ్ఞాని వల్లే పులిచింతల ప్రాజెక్ట్ పూర్తి కాలేదన్నారు. పట్టిసీమ ప్రాజెక్టులో 500 కోట్లను నొక్కేశారని ఆరోపించారు. జూన్‌లోనే కృష్ణా డెల్టాకు నీరిస్తామని చెప్పిన ఉమ ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దమ్ముంటే దేవినేని ఉమ తనతో కలిసి కృష్టా డెల్టాకు రావాలని… రైతులే తరిమికొడుతారని అన్నారు. కృష్ణా డెల్టాను ఎడారిగా మార్చిన దద్దమ్మ దేవినేని ఉమ అని విమర్శించారు.

కృష్ణా పుష్కరాల పనుల్లోనూ భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వీరి దోపిడి దౌర్జన్యాలను అడ్డుకోవడమే జగన్‌ చేసిన తప్పా అని ప్రశ్నించారు. తెలంగాణ అక్రమప్రాజెక్టులపై జగన్‌ నిలదీస్తున్నా… చంద్రబాబు మాత్రం మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ అంటే భయంతోనే నిలదీయాల్సిన చంద్రబాబు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.

Click on Image to Read:

trs

gottipati

Dinesh-Mohaniya

pawan

revanth-reddy

 

brahmin-swis

chandrababu-angry

mla-srikanth-reddy

jagan-ches

chandrababu

chandrababu-insult

dk-aruna

YSR