ఒక మనసును కూడా కత్తిరించి పడేశారు…

సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే చాలు కత్తిరించి పడేస్తున్నారు. అలా చేయడం వల్ల సినిమాకు మళ్లీ జనాలు వచ్చి.. మూవీ సూపర్ హిట్ అయిపోతుందనే భ్రమలో మేకర్స్ ఉన్నారు. ఈమధ్య కాలంలో చాలా సినిమాల విషయంలో అదే జరుగుతోంది. సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చిన వెంటనే కొన్ని సీన్లు లేపేయడం ఆనవాయితీ అయిపోయింది.తాజాగా ఒక మనసు విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమా పొయెటిక్ గా బాగానే ఉన్నట్లు టాక్ వచ్చినా.. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా స్లో గా ఉండటంతో పాటు లెంగ్త్ ఎక్కువగా ఉన్నట్లు టాక్ రావడం, ఆడియన్స్ బోరింగ్ గా ఫీల్ అవుతున్నారని తెలియడంతో మూవీ యూనిట్ కత్తెరలు వేసినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం… ఒక మనసు సినిమా ఫస్ట్ హాఫ్ లో 14 నిమిషాలు కత్తెరించారని తెలుస్తోంది. దీంతో ఈరోజు నుంచి అన్ని షో లలో ‘ఒక మనసు’ సినిమా 14 నిమిషాలు నిడివి తక్కువగా ప్రదర్శితమవుతుందని సమాచారం. అయితే ఇంకాస్త ఎక్కువ బోర్ కొట్టించిన సెకెండాఫ్ ను మాత్రం మేకర్స్ టచ్ చేయకపోవడం విడ్డూరంగా ఉంది. ఈ కత్తిరింపుల సంగతి అంటుంచితే… సినిమా పరిస్థితి మాత్రం చేయిదాటిపోయిందని మెగా కాంపౌండ్ దాదాపు ఫిక్స్ అయిపోయింది. ఇప్పటికిప్పుడు ప్రమోషన్ కోసం మెగా హీరోల్ని రంగంలోకి దించినా పరిస్థితి మెరుగుపడదని అంతా ఫిక్స్ అయిపోయారు. దీంతో ఇక ఒక మనసు అనే ప్రాజెక్టు ఊసెత్తకపోవడమే మంచిదని భావిస్తున్నారట. ఈ గ్యాప్ లో నిహారికకు సంబంధించి రెండో ప్రాజెక్టును ఎనౌన్స్ చేస్తే… కెరీర్ మరింత డ్యామేజీ అవ్వకుండా ఉంటుందని నాగబాబు భావిస్తున్నారట.