దళితులను అవమానించేలా జీవో జారీ

ఏపీలో ఆలయ భూముల సాగుకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో ఒకటి సంచలనం సృష్టిస్తోంది. హిందూ ఆలయాల భూములను ఇకపై హిందూయేతరులు సాగు చేయడానికి వీలులేదని ఏపీ ప్రభుత్వం జీవో 425ను జారీ చేసింది. ఇందులో ప్రభుత్వం చెప్పిన విషయాలు దళితుల పట్ల వివక్షతకు అద్దంపడుతున్నాయి. జీవో ప్రకారం ఇకపై ముస్లింలు హిందూ ఆలయాల భూములను సాగుచేయడం నిషిద్ధం. అది ఒక ఎత్తు. ఇక దళితులకు సంబంధించి ఈ జీవోలో పెట్టిన ఒక నిబంధన ఆశ్చర్యంగా ఉంది.

ఏ దళితుడైనా హిందూ ఆలయ భూములను సాగు చేయాలంటే స్థానికంగా ఉన్న చర్చిలో సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. ఫలాన దళితుడు మా చర్చి కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు… ఇతడు క్రిస్టియన్ కాదు అంటూ చర్చి నుంచి సర్టిఫికేట్ తేవాల్సి ఉంటుంది. అలా తెస్తేనేవారికి లీజుపై ఆలయ భూములను సాగుకు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడే దళిత సంఘాల నుంచి ఒకప్రశ్న వస్తోంది.

ఇటీవల క్రైస్తవంలోకి దళితులే కాదు అన్ని కులాల వారు కూడా చేరుతున్నారు. అలాంటప్పుడు వారందరి నుంచి నాన్ క్రిస్టియన్ సర్టిఫికేట్ అడగకుండా కేవలం దళితులకు మాత్రమే ఈ నిబంధన పెట్టడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒక వేళ ఇప్పటికే సాగు చేస్తున్న ముస్లిములు, దళిత క్రిస్టియన్లు ఉంటే వెంటనే భూములు అప్పగించి వెళ్లిపోవాలని జీవో చెబుతోంది. ఒకవేళ అలా చేసేందుకు వారు నిరాకరిస్తే కబ్జా కేసులు పెట్టి అరెస్ట్ చేయనున్నారు.

ముస్లిం పెద్దల నుంచి కూడా ప్రభుత్వానికి మరో ప్రశ్న ఎదురవుతోంది. గుంటూరు జిల్లాలో మసీదు భూములన్నింటిని హిందువులే సాగు చేస్తున్నారు… మరి ఆలయాల భూములను ముస్లిములు సాగు చేయకూడదని జీవోఇచ్చిన ప్రభుత్వం అదే జీవోను మసీదు భూముల విషయంలో ఎందుకు అమలు చేయదో చెప్పాలని ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ నాయకుడు హబీబ్‌ ఉర్‌ రెహ్మన్‌ డిమాండ్ చేశారు. మొత్తం మీద దళితులు హిందూ ఆలయాల భూములను సాగు చేసుకోవాలంటే స్థానిక చర్చిల నుంచి సర్టిఫికేట్ తీసుకురావాలంటూ చంద్రబాబు ప్రభుత్వం జీవో జారీ చేయడం సంచలనంగానే ఉంది. ఇది  దళితుల పట్ల వివక్ష చూపడమేనంటున్నారు.

Click on Image to Read:

chandrababu-school

shabbir-ali-ys-jagan

jagan-swarupananda-swami

pawan

dk-aruna

gottipati

devineni-uma-jogi-ramesh

brahmin-swis

mla-srikanth-reddy

chandrababu

YSR