దీపిక లుక్ అదుర్స్…!

ప్ర‌స్తుతం బాలీవుడ్ లో దీపిక పదుకోణ్ పేరు ఒక బ్రాండ్. ట్రిపుల్ ఎక్స్ చిత్రంలో లీడ్ రోల్ చేస్తూ.. హాలీవుడ్ లోనూ త‌న ఉనికిని, స‌త్తాను చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. దీంతో ఎక్క‌డ క‌నిపించినా.. మెరుపులే… అందాల ఉరుములే అన్న‌ట్లుంది. తాజాగా స్పెయిన్ లో జ‌రిగిన ఇంట‌ర్నేష‌న‌ల్ ఇండియ‌న్ ఫిల్మ్ అకాడెమీ అవార్డ్స్ ( ఐఫా) వేడుక అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు వ‌క్తులుగా షాహిద్ క‌పూర్, ఫరాన్ అక్త‌ర్, ఆక‌ట్టుకున్నారు. సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన బాజీరావ్ మ‌స్తానీకి పుర‌స్కారాలు పంట పండింది. అలాగే స‌ల్మాన్ ఖాన్ చేసిన భ‌జ‌రంగీ భాయిజాన్ కూడా ప‌లు అవార్డులు గెలుచుకుంది. ఇక హాట్ బ్యూటీ దీపిక ప‌దుకోణ్ న‌టించిన పీకూ చిత్రంకు బెస్ట్ యాక్ట‌రెస్ అవార్డు వ‌చ్చింది. ఇక త‌న స‌హ న‌టి ప్రియాంక చోప్రాకు ఉమెన్ ఆఫ్ ది ఇయ‌ర్ గా అవార్డు వ‌రించింది. కార్య క్ర‌మంలో దీప‌క పదుకోణ్ కాస్టూమ్స్ తో అద‌ర గొట్టింది. సెంట‌ర్ ఆఫ్ ది ఎట్రాక్ష‌న్ గా నిలిచింది . ఎంతైనా దీపిక హాలీవుడ్ వారితో క‌ల‌సి ప‌ని చేసింది క‌దా. డ్రెస్సింగ్ , స్టైల్ విష‌యంలో చాల కిటుకులు తెలుసుకున్న‌ట్లుంది మ‌రి.