Telugu Global
Cinema & Entertainment

పంది పిల్లతో రవిబాబు సినిమా

రవితేజ నటించిన వీడింతే సినిమాలో బ్రహ్మానందం ఓ డైలాగ్ చెబుతాడు. అవసరమైతే కుక్క…కుక్కను పెట్టి సినిమా తీస్తానని కామెడీగా అంటాడు బ్రహ్మానంద. కానీ ఆ డైలాగ్ ను సీరియస్ గా తీసుకున్నాడు రవిబాబు. ఏకంగా పందిని పెట్టి సినిమా తీశాడు. అవును… రవిబాబు నయా మూవీలో పంది పిల్లే హీరో. దాన్నే సూపర్ స్టార్ ని చేస్తానంటున్నాడు రవిబాబు. అందరికీ షాక్ ఇస్తూ ముద్దుముద్దుగా ఉండే ఓ ‘పందిపిల్ల’ ను తన లేటెస్ట్ సినిమాకు మెయిన్ లీడ్ […]

పంది పిల్లతో రవిబాబు సినిమా
X
రవితేజ నటించిన వీడింతే సినిమాలో బ్రహ్మానందం ఓ డైలాగ్ చెబుతాడు. అవసరమైతే కుక్క…కుక్కను పెట్టి సినిమా తీస్తానని కామెడీగా అంటాడు బ్రహ్మానంద. కానీ ఆ డైలాగ్ ను సీరియస్ గా తీసుకున్నాడు రవిబాబు. ఏకంగా పందిని పెట్టి సినిమా తీశాడు. అవును… రవిబాబు నయా మూవీలో పంది పిల్లే హీరో. దాన్నే సూపర్ స్టార్ ని చేస్తానంటున్నాడు రవిబాబు.
అందరికీ షాక్ ఇస్తూ ముద్దుముద్దుగా ఉండే ఓ ‘పందిపిల్ల’ ను తన లేటెస్ట్ సినిమాకు మెయిన్ లీడ్ గా ఎంచుకుని, దాని చుట్టూ తిరిగే కథను ఎంచుకున్నాడు రవిబాబు. ఈ సినిమాలో హీరోహీరోయిన్లు మామూలుగానే ఉన్నా.. పందిపిల్ల ప్రాధాన్యమే ఎక్కువగా ఉంటుందని రవిబాబు పేర్కొనడం విశేషం. ఇక ఈ సినిమాకు ‘అదిగో’ అనే వెరైటీ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. గతంలో అవును అనే సినిమా చేశాడు ఇప్పుడు అదిగో అనే టైటిల్ పెట్టాడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో.. త్వరలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో గ్రాఫిక్స్, యానిమేషన్ కోసం… సొంతంగా ఒక సాఫ్ట్ వేర్ తయారుచేసినట్లు, దానికోసమే 9 నెలలు వెచ్చించినట్లు తెలుస్తోంది. పందిపిల్ల కహానీ ఎలా ఉంటుందో చూడాలి.
First Published:  26 Jun 2016 10:01 PM GMT
Next Story