Telugu Global
NEWS

బాబు చదివిన స్కూల్‌లో ఏం జరుగుతోందంటే...

అది తిరుపతిలోని టంగుటూరి ప్రకాశం పంతులు గవర్నమెంట్ హైస్కూల్. ఈ స్కూల్‌కు ఎంతో చరిత్ర ఉంది. 50ఏళ్లలో వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకున్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఇక్కడే ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదువుకున్నారు. ఈ స్కూల్‌ వద్దకు వెళ్తే ”చంద్రబాబు ఇక్కడే చదివారు” అంటూ ఆయన సందేశంతో పాటు గోడమీద పెద్దగా రాసి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ స్కూల్‌ శిథిలావస్థకు చేరింది. స్కూల్‌ లోపలికి వెళ్తే ఊడేందుకు సిద్ధంగా ఉన్న పెచ్చులు రారమ్మని పిలుస్తుంటాయి. […]

బాబు చదివిన స్కూల్‌లో ఏం జరుగుతోందంటే...
X

అది తిరుపతిలోని టంగుటూరి ప్రకాశం పంతులు గవర్నమెంట్ హైస్కూల్. ఈ స్కూల్‌కు ఎంతో చరిత్ర ఉంది. 50ఏళ్లలో వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకున్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఇక్కడే ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదువుకున్నారు. ఈ స్కూల్‌ వద్దకు వెళ్తే ”చంద్రబాబు ఇక్కడే చదివారు” అంటూ ఆయన సందేశంతో పాటు గోడమీద పెద్దగా రాసి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ స్కూల్‌ శిథిలావస్థకు చేరింది.

img 3 img 1స్కూల్‌ లోపలికి వెళ్తే ఊడేందుకు సిద్ధంగా ఉన్న పెచ్చులు రారమ్మని పిలుస్తుంటాయి. గోడలకు పగుళ్లు వచ్చాయి. వర్షం వస్తే గదులు వర్షపు నీటితో నిండిపోతుంటాయి. ఆ రోజు స్కూల్‌కు దాదాపు సెలవే. సీఎం చదివిన ఈ స్కూల్‌లో కనీసం తాగేందుకు మంచినీరు లేదంటే ఆశ్చర్యమే.

img 5
విద్యార్ధిని గీతా

స్కూల్‌లో మంచినీరు లేక తాము రూపాయి ఇచ్చి బయటి నుంచి వాటర్‌ ప్యాకెట్‌ తెచ్చుకుంటామని గీతా అనే విద్యార్థిని చెప్పింది. కనీసం తమకు టాయిలెట్‌లు కూడా లేవంది. మధ్యాహ్నం భోజనం కూడా నాసికరమే.

img 2
విద్యార్ధి రాజు

ఇప్పటికైనా ”మా చంద్రబాబు గారు మంచి అన్నం పెట్టాలని కోరుకుంటున్నా” అని మీడియా ముందు రాజు అనే విద్యార్థి కోరారు. ఇక్కడ అన్నం తింటుంటే కడపు నొప్పి వస్తోందని చెప్పాడు.

ఒకప్పుడు ఈ స్కూల్‌లో ఏడాదికి 600 మంది విద్యార్థులు చదివేవారు. కానీ కనీస సదుపాయాలు లేకపోయే సరికి ఇప్పుడు కేవలం 150 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. చంద్రబాబు చదివిన స్కూల్‌లోనే ఈ పరిస్థితి ఉండడంపై పూర్వవిద్యార్థులు ఆవేదన చెందారు. మాటకు ముందు అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మిస్తానని చెప్పే చంద్రబాబు… ముందు తాను చదివిన స్కూల్ ఎలా ఉందో చూడాలని మహేష్ అనే పూర్వ విద్యార్థి కోరారు. చంద్రబాబు ఇక్కడ చదివారని చెప్పుకోవడానికి తప్ప ఏం ఉపయోగం లేకుండాపోయిందని వాపోయారు.

అమరావతిని శుభ్రంగా ఊడ్చేస్తానని చెప్పే చంద్రబాబు… తాను చదివిన స్కూల్‌లో కనీసం టాయ్‌లెట్లు నిర్మించాలని మరో పూర్వ విద్యార్థి అజయ్‌కుమార్ కోరారు. గతేడాది మంత్రి గంటాశ్రీనివాస్‌రావు తిరుపతి వచ్చిన సమయంలో కొందరు స్కూల్ దుస్థితిని ఆయనకు వివరించారు. చంద్రబాబుగారు చదివిన స్కూల్‌లో ఇబ్బందులు… త్వరలోనే బ్రహ్మాండంగా స్కూల్‌ను మార్చేస్తామని చెప్పారు. కానీ చంద్రబాబు స్కూల్‌ అప్పటిలాగే ఉంది. ఏమార్పూ లేదు.

పరిస్థితి అంతా చూశాక అక్కడ బోర్డుమీద ”చంద్రబాబు ఇక్కడే చదివారు” అని రాయించిన వాళ్లు చంద్రబాబుమీద ప్రేమతో రాశారా లేక ఈ స్కూల్ ను చంద్రబాబు ఇంత దరిద్రంగా వుంచాడు అని చెప్పడానికి రాశారా? అనిపించక మానదు.

img 4 img 6

Click on Image to Read:

back-caste-go

shabbir-ali-ys-jagan

jagan-swarupananda-swami

pawan

dk-aruna

gottipati

devineni-uma-jogi-ramesh

brahmin-swis

mla-srikanth-reddy

chandrababu

YSR

First Published:  26 Jun 2016 11:58 PM GMT
Next Story