జగన్‌ను ఏకిపారేద్దామని వచ్చారట…కానీ అంతలోనే…

జగన్‌ ఏ విషయంలో దొరుకుతారా… ప్రెస్‌మీట్లు పెట్టి విరుచుకుపడుదామా అని టీడీపీలోని ఒక వర్గం నేతలు కాచుకుని ఉంటారు. ఆ నేతలు ఇటీవల విదేశాల్లో జగన్‌ గోల్ఫ్ ఆడుతున్న ఫొటోలను చూసి తెగ సంబరపడిపోయారట. దొరికాడు.. ఇక ప్రెస్‌మీట్ పెట్టి విరుచుకుపడుదామని కొందరు నేతలు రెడీ అయ్యారట.

”చంద్రబాబు ఇక్కడ రాత్రిపగలు తేడా లేకుండా కష్టపడుతుంటే ప్రతిపక్ష నేతగా ఇక్కడ ఉండి సలహాలు ఇవ్వాల్సిందిపోయి విదేశాలకు వెళ్లి గోల్ఫ్ ఆడుతారా?. చెస్‌ ఆడుతూ టైమ్ పాస్ చేస్తారా?. అంతటితో ఆగకుండా ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తారా?” అంటూ జగన్‌ను ఏకిపారేద్దామని కొందరు టీడీపీ నేతలు సిద్దమయ్యారట. అయితే ప్రెస్‌మీట్ పెట్టేందుకు తీరా సిద్దమవుతున్న వేళ పార్టీ ఆఫీస్ నుంచి జగన్‌ ఫొటోలపై ప్రెస్‌మీట్ వద్దంటూ సూచనలు అందాయని చెబుతున్నారు. దీనిపై అసలు విషయం ఆరా తీయగా ఆఫీస్‌ సిబ్బంది కొన్ని విషయాలు చెప్పారట.

మీరు ఇప్పుడు జగన్‌ గోల్ఫ్‌ ఫొటోలపై గోల చేస్తే వైసీపీ వాళ్లు లోకేష్ బొమ్మలను బయటకు తీస్తారని హెచ్చరించారట. గతంలో విదేశాల్లో మందు తాగుతూ, అమ్మాయిలతో కలిసి స్విమ్మింగ్‌ పూల్‌లో లోకేష్ స్నానం చేస్తున్నట్టు ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కాబట్టి జగన్ గోల్ఫ్‌పై గోల చేస్తే…”మా జగన్ మీ లోకేష్‌లాగా మందు తాగలేదు. అమ్మాయిలతో తిరగలేదు. అమ్మాయిలతో కలిసి బీచ్‌ల్లో తిరగలేదు, స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడలేదు” అంటూ వైసీపీ నేతల నుంచి ఎదురయ్యే ఎదురుదాడిపై ముందే టీడీపీ  ఒక అంచనాకు వచ్చిందట. అందుకే జగన్ గోల్ఫ్ ఆటపై మనసార తిడుదామని వచ్చిన టీడీపీ ప్రతినిధులు.. లోకేష్ ఫొటోల విషయం గురించి తెలియగానే ఉసూరుమంటూ వెళ్లిపోయారట. ఒక విధంగా జగన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలనుకుంటే లోకేష్‌ ఫొటోలే టీడీపీ నేతలకు అడ్డుపడ్డాయన్న మాట.

Click on Image to Read:

shabbir-ali-ys-jagan

jagan-swarupananda-swami

chandrababu-school

babu china tour

high-court

Quthbullapur-MLA-Vivekanada

back-caste-go

pawan

hyd court 1

dk-aruna

gottipati

devineni-uma-jogi-ramesh

brahmin-swis

mla-srikanth-reddy

chandrababu

YSR