Telugu Global
National

ఇక పోస్ట్ మ్యాన్‌...స్మార్ట్‌గా వ‌స్తాడు!

పోస్ట్…అంటూ మ‌న ఇళ్ల ముందు ఓ సుప‌రిచిత‌మైన కేక…ఇప్పుడు విన‌బ‌డ‌టం లేదు. ఫోన్లు, ఇంట‌ర్ నెట్ వాడ‌కంతో భార‌త పోస్ట‌ల్ స‌ర్వీసు దాని పూర్వ వైభ‌వాన్ని పూర్తిగా కోల్పోయింది. 2013లో టెలిగ్రామ్ స‌ర్వీస్‌ల‌ను పూర్తిగా నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. పోగొట్టుకున్న దాంట్లో కొంత‌యినా తిరిగి తెచ్చుకోవాలనే ఆలోచ‌న‌లో ఉంది భారత పోస్ట‌ల్ టెలికాం శాఖ‌. ఇందుకోసం ప‌లుర‌కాల ఆలోచ‌న‌లు చేస్తున్నారు. ఇండియా పోస్ట్ ద్వారా రిషికేష్‌, హ‌రిద్వార్‌ల గంగాజ‌లాన్ని భ‌క్తుల చెంత‌కు చేరేలా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని ఇటీవ‌ల […]

ఇక పోస్ట్ మ్యాన్‌...స్మార్ట్‌గా వ‌స్తాడు!
X

పోస్ట్…అంటూ మ‌న ఇళ్ల ముందు ఓ సుప‌రిచిత‌మైన కేక…ఇప్పుడు విన‌బ‌డ‌టం లేదు. ఫోన్లు, ఇంట‌ర్ నెట్ వాడ‌కంతో భార‌త పోస్ట‌ల్ స‌ర్వీసు దాని పూర్వ వైభ‌వాన్ని పూర్తిగా కోల్పోయింది. 2013లో టెలిగ్రామ్ స‌ర్వీస్‌ల‌ను పూర్తిగా నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. పోగొట్టుకున్న దాంట్లో కొంత‌యినా తిరిగి తెచ్చుకోవాలనే ఆలోచ‌న‌లో ఉంది భారత పోస్ట‌ల్ టెలికాం శాఖ‌. ఇందుకోసం ప‌లుర‌కాల ఆలోచ‌న‌లు చేస్తున్నారు. ఇండియా పోస్ట్ ద్వారా రిషికేష్‌, హ‌రిద్వార్‌ల గంగాజ‌లాన్ని భ‌క్తుల చెంత‌కు చేరేలా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని ఇటీవ‌ల టెలీకాం శాఖా మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ప్ర‌క‌టించారు. ఇందు కోసం ఈ -కామ‌ర్స్ వేదిక‌ల‌ను వియోగించుకోవాల్సిందిగా ఆయ‌న స‌ద‌రు శాఖా సిబ్బందిని ఆదేశించారు.

మ‌న‌దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా పోస్ట‌ల్ స‌ర్వీస్ ఇలాంటి స్థితిలోనే ఉంది. అమెరికాలో గత ప‌దేళ్లుగా ఇదే ప‌రిస్థితి ఉంది. స్విట్జ‌ర్లాండ్‌లో పోస్ట‌ల్ శాఖ ద్రోన్ల ద్వారా పార్శిళ్లు పంపే ప్ర‌యోగాల్లో ఉంది. బ్రిట‌న్‌లోని 500 సంవ‌త్స‌రాల చరిత్ర ఉన్న రాయ‌ల్ మెయిల్‌ని, జ‌పాన్‌లోని జ‌పాన్ పోస్ట్‌ని ప్ర‌యివేటు సంస్థ‌ల‌కు ఇచ్చేశారు. ఈ క్రమంలో భార‌త్ పోస్ట‌ల్ స‌ర్వీస్‌ని పూర్తిగా ఆధునీక‌రించే ప్ర‌య‌త్నాల్లో ఉంది ప్ర‌భుత్వం. అమెజాన్, టెలిబ్రాండ్‌, ఫ్లిప్‌కార్ట్, నాప్తాల్ లాంటి ఈ కామ‌ర్స్ సంస్థ‌ల‌తో ఇప్ప‌టికే టైఆప్ అయ్యింది. 2017నాటికి ప్ర‌తి పోస్ట్ మ్యాన్‌కి ఈ-కామ‌ర్స్‌పై అవ‌గాహ‌న‌ని పెంచి వారికి విధి నిర్వ‌హ‌ణ‌కు గాను ఒక స్మార్ట్ ఫోన్‌ని ఇవ్వ‌నున్నారు. పోస్ట్‌ల్ బ్యాంక్‌ని కూడా నెల‌కొల్పాల‌నుకుంటున్నారు. మొబైల్ కంపెనీల‌తో, ఫాస్ట్ మూవింగ్ కంజూమ‌ర్ గూడ్స్ కంపెనీల‌తో, ఫైనాన్షియ‌ల్ కంపెనీల‌తో టై అప్ పెట్టుకుని వ‌స్తువుల‌ను, బ్యాంక్ స్టేట్‌మెంట్ల‌ను, ఆర్థిక సంస్థ‌లు ఇచ్చే ఫైనాన్షియ‌ల్ ఉత్ప‌త్తుల‌ను పోస్ట‌ల్ స‌ర్వీస్ ద్వారా డెలివ‌రీ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఇదంతా జ‌రిగితే …ఆధునిక ఈ-కామ‌ర్స్ టెక్నాల‌జీ అండ‌తో భార‌త పోస్ట‌ల్ స‌ర్వీస్ తిరిగి పున‌రుజ్జీవం పొంద‌వ‌చ్చు.

First Published:  28 Jun 2016 1:05 AM GMT
Next Story