Telugu Global
Cinema & Entertainment

హమ్మయ్య మహేష్ వచ్చేశాడు... ఇక సినిమా షురూ....

మహేష్ ఈసారి చాలా గ్యాప్ తీసుకున్నాడు. అప్పుడెప్పుడో బ్రహ్మోత్సవం సినిమా విడుదలైన కొత్తలో విదేశాలకు వెళ్లాడు మహేష్. అట్టర్ ఫ్లాప్ అయిన బ్రహ్మోత్సవం సినిమాను థియేటర్ల నుంచి ఎప్పుడో ఎత్తేశారు. ఇప్పుడు ఎక్కడా ఆడడం లేదు ఆ సినిమా. ఇది జరిగి చాలా రోజులు అయినప్పటికీ మహేష్ మాత్రం తిరిగి ఇండియాకు రాలేదు. మే 20న ఐరోపా పర్యటన చేపట్టిన మహేష్… లండన్ నుంచి స్విట్జర్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, ఆస్ట్రియా… ఇలా ఎన్నో దేశాలు చుట్టేశాడు. అందమైన […]

హమ్మయ్య మహేష్ వచ్చేశాడు... ఇక సినిమా షురూ....
X
మహేష్ ఈసారి చాలా గ్యాప్ తీసుకున్నాడు. అప్పుడెప్పుడో బ్రహ్మోత్సవం సినిమా విడుదలైన కొత్తలో విదేశాలకు వెళ్లాడు మహేష్. అట్టర్ ఫ్లాప్ అయిన బ్రహ్మోత్సవం సినిమాను థియేటర్ల నుంచి ఎప్పుడో ఎత్తేశారు. ఇప్పుడు ఎక్కడా ఆడడం లేదు ఆ సినిమా. ఇది జరిగి చాలా రోజులు అయినప్పటికీ మహేష్ మాత్రం తిరిగి ఇండియాకు రాలేదు. మే 20న ఐరోపా పర్యటన చేపట్టిన మహేష్… లండన్ నుంచి స్విట్జర్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, ఆస్ట్రియా… ఇలా ఎన్నో దేశాలు చుట్టేశాడు. అందమైన పర్యాటక ప్రదేశాలు చూశాడు. దాదాపు నెల రోజుల పాటు ఇలా టూరిస్ట్ లా మారిపోయిన మహేష్… అన్నీ ముగించుకొని నిన్ననే హైదరాబాద్ చేరుకున్నాడు. మహేష్ రాకతో ఆయన కొత్త సినిమా మరోసారి తెరపైకి వచ్చింది. హైదరాబాద్ వచ్చిన వెంటనే దర్శకుడు మురుగదాస్ తో సమావేశమయ్యాడు మహేష్. తన కొత్త సినిమా సంగతుల్ని అడిగి తెలుసుకున్నాడు. స్క్రిప్ట్ లో ఏమైనా మార్పులు చేశారేమో కనుక్కున్నాడు. హీరోయిన్ గా పరిణీతి చోప్రాను ఫిక్స్ చేశాడు. వచ్చేనెల 15న సినిమా షూటింగ్ కు వస్తానని చెప్పాడు. ఈ మేరకు కాల్షీట్లు సర్దుబాటు చేశాడు. మరి ఈ 15 రోజులు మహేష్ ఏం చేయబోతున్నాడు…? దీనికి కూడా ప్లాన్ ఫిక్స్ చేశాడు ప్రిన్స్. యాక్షన్ ఓరియంటెడ్ గా తెరకెక్కనున్న మరుగదాస్ సినిమా కోసం… ఈ 15 రోజులు కసరత్తులు చేయాలని నిర్ణయించుకున్నాడు. పూర్తిగా జిమ్ లోనే గడిపి, ఫిట్ గా తయారవ్వాలని మహేష్ నిర్ణయించుకున్నాడు. అందుకే వెంటనే షూటింగ్ మొదలుపెట్టకుండా ఈ గ్యాప్ తీసుకున్నాడని కూడా చెబుతున్నారు.
First Published:  27 Jun 2016 10:12 PM GMT
Next Story