Telugu Global
NEWS

టేక్ ఇన్ ఇండియాను అడ్డుకుంటాం... జగన్‌తో ఢిల్లీకి వెళ్తాం..

అమరావతి నిర్మాణాన్ని స్విస్‌ చాలెంజ్ విధానంలో సింగపూర్ కంపెనీలకు అప్పగించడాన్ని వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా వ్యతిరేకించారు. స్విస్‌ చాలెంజ్ విధానాన్ని అడ్డుకుని తీరుతామన్నారు. దీనికోసం ఎంతవరకైనా పోరాడుతామన్నారు. త్వరలోనే జగన్‌ నేతృత్వంలో వైసీపీ ప్రజానిధుల బృందం వెళ్లి మోదీకి ఫిర్యాదు చేస్తామన్నారు. తెలుగువారి భవిష్యత్తును చంద్రబాబు మరోసారి తెల్లదొరల చేతిలో పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని రోజా ఆరోపించారు. విపత్తులు వచ్చినా, నష్టం వచ్చినా, కంపెనీలు దివాలా తీసినా తిరిగి ఏపీనే నష్టపరిహారం చెల్లించాలంటూ నిబంధన పెట్టడం […]

టేక్ ఇన్ ఇండియాను అడ్డుకుంటాం... జగన్‌తో ఢిల్లీకి వెళ్తాం..
X

అమరావతి నిర్మాణాన్ని స్విస్‌ చాలెంజ్ విధానంలో సింగపూర్ కంపెనీలకు అప్పగించడాన్ని వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా వ్యతిరేకించారు. స్విస్‌ చాలెంజ్ విధానాన్ని అడ్డుకుని తీరుతామన్నారు. దీనికోసం ఎంతవరకైనా పోరాడుతామన్నారు. త్వరలోనే జగన్‌ నేతృత్వంలో వైసీపీ ప్రజానిధుల బృందం వెళ్లి మోదీకి ఫిర్యాదు చేస్తామన్నారు. తెలుగువారి భవిష్యత్తును చంద్రబాబు మరోసారి తెల్లదొరల చేతిలో పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని రోజా ఆరోపించారు.

విపత్తులు వచ్చినా, నష్టం వచ్చినా, కంపెనీలు దివాలా తీసినా తిరిగి ఏపీనే నష్టపరిహారం చెల్లించాలంటూ నిబంధన పెట్టడం దారుణమన్నారు. చివరకు అమరావతిలో స్థలం కావాలన్నా సింగపూర్‌ కంపెనీ వాడికి దరఖాస్తు పెట్టుకోవాల్సి రావడం మించి దారుణం మరొకటి ఉండదన్నారు. 300 కోట్లు ఖర్చు చేసే సింగపూర్ కంపెనీలకు 58 శాతం వాటా ఎలా ఇస్తారని రోజా ప్రశ్నించారు. మోదీ మేక్‌ ఇన్ ఇండియా అంటుంటే చంద్రబాబు మాత్రం టేక్‌ ఇన్ ఇండియా అంటూ విదేశాలకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. స్విస్‌ చాలెంజ్‌పై సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామన్నారు. ఈ విషయంలో బీజేపీ పెద్దలు కూడా నోరు విప్పాలని రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడికి భగవంతుడన్నా భయంలేకుండాపోయిందని అందుకే దేవుడి భూములను కూడా మింగేస్తున్నారని రోజా మండిపడ్డారు. అమరావతితో బాంబులు పెట్టి తెలుగుజాతి భవిష్యత్తును పేల్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారామె.

Click on Image to Read:

vijaya sai reddy

kavitha

ap-minister

pawan

c-kalyan-comments

mohan-babu

paritala-sunitha-prabhakar-

ys-jagan

shabbir-ali-ys-jagan

jagan-swarupananda-swami

chandrababu-school

babu china tour

back-caste-go

pawan

dk-aruna

brahmin-swis

First Published:  28 Jun 2016 2:54 AM GMT
Next Story