Telugu Global
Cinema & Entertainment

ఓ పక్క బేవాచ్... మరో పక్క వ్యోమగామి....

ఒక‌ప్పుడు హాలీవుడ్ లో ఇండియ‌న్ ఆర్టిస్ట్ లు న‌టించ‌డ‌మంటే పెద్ద‌గా గుర్తింపులేని రోల్స్ ఉండేవి. క‌ట్ చేస్తే తీరు మారింది. ప్ర‌స్తుతం ప్రియాంక చోప్రా, దీపిక ప‌దుకోణ్ లు న‌టిస్తున్న హాలీవుడ్ చిత్రాల్లో వారు మెయినో్ లీడ్స్ లో ఒక‌రు గా చేస్తున్నారు. క్వాంటికో సీరిస్ తో ప్రియాంక చోప్రా సూప‌ర్ పాపుల‌ర్ అయ్యింది. దీపిక ప‌దుకోణ్ అయితే ఏకంగా ట్రిపుల్ ఎక్స్ చిత్రంలో ఒక హీరోయిన్ గా చేస్తుంది. అయితే ఈ ప‌రిణ‌మాంతో ప్ర‌స్తుతం బాలీవుడ్ […]

ఓ పక్క బేవాచ్... మరో పక్క వ్యోమగామి....
X

ఒక‌ప్పుడు హాలీవుడ్ లో ఇండియ‌న్ ఆర్టిస్ట్ లు న‌టించ‌డ‌మంటే పెద్ద‌గా గుర్తింపులేని రోల్స్ ఉండేవి. క‌ట్ చేస్తే తీరు మారింది. ప్ర‌స్తుతం ప్రియాంక చోప్రా, దీపిక ప‌దుకోణ్ లు న‌టిస్తున్న హాలీవుడ్ చిత్రాల్లో వారు మెయినో్ లీడ్స్ లో ఒక‌రు గా చేస్తున్నారు. క్వాంటికో సీరిస్ తో ప్రియాంక చోప్రా సూప‌ర్ పాపుల‌ర్ అయ్యింది. దీపిక ప‌దుకోణ్ అయితే ఏకంగా ట్రిపుల్ ఎక్స్ చిత్రంలో ఒక హీరోయిన్ గా చేస్తుంది. అయితే ఈ ప‌రిణ‌మాంతో ప్ర‌స్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా కొన సాగుతున్న ప్రియాంక‌, దీప‌క‌లు ఇటు బాలీవుడ్ నుంచి.. అటు హాలీవుడ్ కు ష‌టిల్ స‌ర్వీస్ చేస్తున్నారు.

ముఖ్యంగా ప్రియాంక చోప్రా ఇటు బాలీవుడ్ లో తీర‌క లేకుండా వుండే హీరోయిన్. క్వాంటికో టీవి షోకు ప‌నిచేస్తూనే బాజీరావ్ మ‌స్తానీ లో న‌టించింది. ఇప్పుడేమో బేవాచ్ అనే హింది చిత్రం చేస్తూనే .. క్వాంటికో త‌దుప‌రి సిరీస్ కు ప‌నిచేస్తుంది. మ‌రో ప‌క్క బాలీవుడ్ క‌థ‌లు వింటుంద‌ట‌. అయితే ఇది ప్రియాంక చోప్రాకు చాల ఇబ్బంది క‌రంగా ఉంద‌ట‌. ఒక విధ‌మైన ఒత్తిడికి లోను అవుతుంద‌ట‌. దీంతో ఇక నుంచి రెండు చిత్రాల్లోనే నటించాల‌ని ఆలోచన చేస్తుంద‌ట. ఒక బాలీవుడ్ ..ఒక హాలీవుడ్ ఫిల్మ్ చేయాల‌ని అనుకుంటుంద‌ట‌. వ్యోమ‌గామి క‌ల్ప‌నా చావ్లా జీవిత క‌థ‌తో చేసేసినిమాతో పాటు మ‌రో చిత్రం ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో చేయ‌నుంద‌ని టాక్. ప్ర‌స్తుతం త‌న చేతిలి 16 స్క్రీప్ట్ ఉన్నాయ‌ట‌. వాటిలో త‌న‌కు ఏది న‌చ్చుతుందో ..అదే నెక్ట్స్ బాలీవుడ్ లో త‌ను చేయ‌బోయో ఫిల్మ్ .

First Published:  28 Jun 2016 1:41 AM GMT
Next Story