పదవిని అలంకారం అనుకోను…

ఇటీవల తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్ సచివాలయంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి సభ్యుల చేత ప్రమాణస్వీకారం చేయించారు. కేంద్రమంత్రి సురేష్ ప్రభు, విజయసాయిరెడ్డి, డీఎస్, లక్ష్మీకాంతరావు ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్, కేంద్రమంత్రులు అరుణ్‌ జైట్లీ, వెంకయ్యనాయుడు, ఎంపీ సుబ్బరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి… రాజ్యసభ పదవిని తాను ఒక అలంకారప్రాయంగా చూడడం లేదన్నారు. రాష్ట్ర ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఈ పదవిని ఉపయోగించుకుంటానని చెప్పారు. వైసీపీ నుంచి తొలిరాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవడం చాలా ఆనందంగా ఉందన్నారు.తనకు ఈ అవకాశం ఇచ్చిన జగన్‌ మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు విజయసాయిరెడ్డి. తన సభ్యత్వానికి మద్దతు పలికిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు,పార్టీ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

21  3 4 5

Click on Image to Read:

kavitha

ap-minister

pawan

c-kalyan-comments

mohan-babu

paritala-sunitha-prabhakar-

ys-jagan

shabbir-ali-ys-jagan

jagan-swarupananda-swami

chandrababu-school

babu china tour

back-caste-go

pawan

dk-aruna

brahmin-swis