Telugu Global
CRIME

ఆ నాన్న అలా చేశాడు...ఈ కూతురు ఇలా బుక్క‌య్యింది!

బీహార్ 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ టాప‌ర్స్ కుంభ‌కోణంలో అరెస్టయిన రూబీరాయ్ విచార‌ణ‌లో దిమ్మ‌తిరిగిపోయే నిజాల‌ను చెప్పింది. తాను త‌న తండ్రిని  పాస్ చేయించ‌మ‌ని మాత్ర‌మే అడిగాన‌ని, కానీ ఆయ‌న టాప‌ర్‌ని చేశార‌ని తెలిపింది. త‌న‌కు సెకండ్ క్లాసు మాత్ర‌మే వ‌స్తుంద‌ని అనుకున్నాన‌ని కానీ ఇలా జ‌రుగుతుంద‌ని అనుకోలేదంది. 12వ త‌ర‌గ‌తిలో ఆర్ట్స్ విభాగంలో టాప‌ర్‌గా నిలిచిన రూబీరాయ్ పొలిటిక‌ల్ సైన్స్‌ని ప్రాడిగ‌ల్ సైన్స్ అని ప‌లికి దొరికిపోయింది. తుల‌సీ దాస్ గురించి రాయ‌మ‌న్న‌పుడు ఆమె తుల‌సీదాస్‌…ప్ర‌ణామ్‌…అని రాసి […]

బీహార్ 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ టాప‌ర్స్ కుంభ‌కోణంలో అరెస్టయిన రూబీరాయ్ విచార‌ణ‌లో దిమ్మ‌తిరిగిపోయే నిజాల‌ను చెప్పింది. తాను త‌న తండ్రిని పాస్ చేయించ‌మ‌ని మాత్ర‌మే అడిగాన‌ని, కానీ ఆయ‌న టాప‌ర్‌ని చేశార‌ని తెలిపింది. త‌న‌కు సెకండ్ క్లాసు మాత్ర‌మే వ‌స్తుంద‌ని అనుకున్నాన‌ని కానీ ఇలా జ‌రుగుతుంద‌ని అనుకోలేదంది. 12వ త‌ర‌గ‌తిలో ఆర్ట్స్ విభాగంలో టాప‌ర్‌గా నిలిచిన రూబీరాయ్ పొలిటిక‌ల్ సైన్స్‌ని ప్రాడిగ‌ల్ సైన్స్ అని ప‌లికి దొరికిపోయింది. తుల‌సీ దాస్ గురించి రాయ‌మ‌న్న‌పుడు ఆమె తుల‌సీదాస్‌…ప్ర‌ణామ్‌…అని రాసి ఊరుకున్న సంగ‌తి తెలిసిందే. మొత్తానికి రూబీరాయ్ తాను టాప‌ర్ స్థానానికి అర్హురాలిని కాదని స్ప‌ష్టంగా ఒప్పుకుంద‌ని… ఈ స్కామ్‌లో విచార‌ణ జ‌రుపుతున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందానికి సార‌ధ్యం వ‌హిస్తున్న పాట్నా స్పెష‌ల్ ఎస్‌పి పేర్కొన్నారు.

First Published:  28 Jun 2016 9:45 PM GMT
Next Story