Telugu Global
Cinema & Entertainment

మరో బడా దర్శకుడితో నితిన్ సినిమా

చూస్తుంటే… త్రివిక్రమ్…నితిన్ జాతకాన్ని పూర్తిగా మార్చేసినట్టున్నాడు. అ..ఆ సినిమాతో నితిన్ ను సూపర్ స్టార్ ను చేసిన త్రివిక్రమ్… అతడి కెరీర్ ను మరో 10 మెట్లు పైకి ఎక్కించాడు. మొన్నటి వరకు ఓ రకమైన దర్శకులతో మాత్రమే పనిచేసిన నితిన్… త్రివిక్రమ్ ఇచ్చిన ఊపుతో ఇప్పుడు బడా దర్శకులపై కన్నేశాడు. టాలీవుడ్, కోలీవుడ్ లో పెద్ద దర్శకులతోనే సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అందుకే ఈమధ్య ఓ కథ వినిపించిన కొండా విజయ్ కుమార్ ను […]

మరో బడా దర్శకుడితో నితిన్ సినిమా
X

చూస్తుంటే… త్రివిక్రమ్…నితిన్ జాతకాన్ని పూర్తిగా మార్చేసినట్టున్నాడు. అ..ఆ సినిమాతో నితిన్ ను సూపర్ స్టార్ ను చేసిన త్రివిక్రమ్… అతడి కెరీర్ ను మరో 10 మెట్లు పైకి ఎక్కించాడు. మొన్నటి వరకు ఓ రకమైన దర్శకులతో మాత్రమే పనిచేసిన నితిన్… త్రివిక్రమ్ ఇచ్చిన ఊపుతో ఇప్పుడు బడా దర్శకులపై కన్నేశాడు. టాలీవుడ్, కోలీవుడ్ లో పెద్ద దర్శకులతోనే సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అందుకే ఈమధ్య ఓ కథ వినిపించిన కొండా విజయ్ కుమార్ ను కూడా పక్కనపెట్టాడని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మరో క్రేజీ డైరెక్టర్ సీన్ లోకి వచ్చాడు. యస్.. త్వరలో నితిన్ చేయబోయే సినిమాకు సురేందర్ రెడ్డి డైరెక్టర్ అట. ప్రస్తుతం సురేందర్ రెడ్డి రామ్ చరణ్ హీరోగా ధృవ సినిమా చేస్తున్నాడు. చాలా వేగంగా షూటింగ్ జరుపుకుని ఈ యేడాదే విడుదల కాబోతోంది ధృవ.. సో.. ఈ మూవీ తర్వాత సురేందర్ రెడ్డి, నితిన్ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కుతుందని చెబుతున్నారు. అలాగే మరో బయటి బ్యానర్ లో కూడా నితిన్ ఓ సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు కొండా విజయ్ కుమార్ డైరెక్టర్ కావొచ్చనేది ఇన్ సైడ్ టాక్. ఏదేమైనా నితిన్ లో ఈ మార్పు చూస్తోంటే అతన్నించి రాబోయే రోజుల్లో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాలు వచ్చేలా ఉన్నాయి.

First Published:  28 Jun 2016 9:11 PM GMT
Next Story