నేను మార్చుకోను అంటున్న అనుష్క‌…!

ఏ రంగంలో వారికైన కెరీర్ ప‌రంగా ఎదగాలని అనుకోవడం స‌హ‌జ‌మే.  అందుకు సినిమా ఇండ‌స్ట్రీ  అతీతం కాదు. హీరోయిన్ గా ప‌రిచ‌యం అయిన‌ప్ప‌టి నుంచి సాధార‌ణ హీరోయిన్ స్థాయి నుంచి..  స్టార్ హీరోయిన్ కావాల‌నే క‌ల‌లు కంటారు.  ఇక్క‌డ  స‌క్సెస్ వ‌స్తే బాలీవుడ్ లో ట్రై చేస్తుంటారు.  కాజ‌ల్, త్రిష , ప్రియ‌మ‌ణి, త‌మ‌న్నా, ఇలా బాలీవుడ్ లో ప్ర‌య‌త్నాలు చేస్తున్న వారే.  కానీ  అనుష్క మాత్రం నా ట్రాకే స‌ప‌రేటు అంటోంది. 
త‌ను బాలీవుడ్ కు వెళ్ల కూడ‌ద‌ని గిరి ఏది గీసుకో పోయిన‌ప్ప‌టికి… త‌ను మాత్రం అంత తేలిగ్గా బాలీవుడ్ కు వెళ్ల‌ద‌ట‌.   స‌ల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో కూడా త‌న చిత్రంలో న‌టించ‌మ‌ని అడిగారట‌. అయితే ఒక కొత్త లాంగ్వేజ్ లో చేస్తున్న‌ప్పుడు..మ‌న‌సును  ఉత్సాహా ప‌రిచే రోల్  దొరికితేనే చేయాల‌న్న‌ది త‌న గ‌ట్టి నిర్ణ‌య‌మ‌ట‌. అప్ప‌టి వ‌ర‌కు  త‌ను  ద‌క్షిణాదిలోనే చేయ‌డానికి  క‌మిటైన‌ట్లు అనుష్క  క్లారీటి ఇచ్చింది.  కొత్త  కాన్సెప్ట్ తో చిత్రాలు చేస్తుంటారు.  మ‌న ద‌గ్గ‌ర మాత్రం  రోటిన్ మ‌సాలా ఎక్కువుగా చేస్తుంటార‌ని  చెప్పింది. సో ఓవ‌రాల్ గా  అనుష్క బాలీవుడ్ లో చేయాలంటే  త‌న రోల్ కు  తగిన ప్రాధాన్యంతో పాటు..  త‌న‌కు  మంచి గుర్తింపు తెచ్చే సినిమా అనుకుంటేనే  చేస్తుంద‌న్న‌మాట‌. ప్ర‌స్తుతం  బాహుబ‌లి 2   , భాగ్య‌మ‌తి  , త‌మిళ్ లో  సింగం 3 చిత్రాలు చే్స్తుంది.