Telugu Global
NEWS

హైకోర్టు విభ‌జ‌న వివాదం...  జీఎస్టీ బిల్లుకు కేసీఆర్ మ‌ద్ద‌తిస్తారా?

కొంత‌కాలంగా బీజేపీ- టీఆర్ ఎస్ ల మ‌ధ్య ప‌లు విష‌యాల్లో విభేదాలు పొడ‌చూపాయి.  హైకోర్టుతో స‌హా.. విభ‌జ‌న స‌మ‌స్య‌లు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ విష‌యంలో మీరంటే మీరు కార‌ణ‌మంటూ కేంద్రం.. రాష్ట్రం ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే పార్ల‌మెంటు స‌మావేశాల్లో జీఎస్టీ బిల్లు ఆమోదానికి బీజేపీకి, గులాబీ పార్టీ మ‌ద్ద‌తిస్తుందా?  లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. జూలై 18 నుంచి వ‌ర్షాకాల పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రుగ‌నున్నాయి. ఎన్‌డీఏ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తోన్న వ‌స్తుసేవ‌ల […]

కొంత‌కాలంగా బీజేపీ- టీఆర్ ఎస్ ల మ‌ధ్య ప‌లు విష‌యాల్లో విభేదాలు పొడ‌చూపాయి. హైకోర్టుతో స‌హా.. విభ‌జ‌న స‌మ‌స్య‌లు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ విష‌యంలో మీరంటే మీరు కార‌ణ‌మంటూ కేంద్రం.. రాష్ట్రం ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే పార్ల‌మెంటు స‌మావేశాల్లో జీఎస్టీ బిల్లు ఆమోదానికి బీజేపీకి, గులాబీ పార్టీ మ‌ద్ద‌తిస్తుందా? లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. జూలై 18 నుంచి వ‌ర్షాకాల పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రుగ‌నున్నాయి. ఎన్‌డీఏ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తోన్న వ‌స్తుసేవ‌ల ప‌న్ను (జీఎస్టీ) బిల్లును ఈ స‌మావేశాల్లోనే..ఎలాగైనా ఆమోదింప జేసుకోవాల‌ని భావిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే మిత్ర‌ప‌క్షాలు..విప‌క్షాల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు కేంద్రం మ‌రోసారి ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.
కానీ, కేంద్రం – రాష్ట్రం మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తోన్న ఈ స‌మ‌యంలో పార్ల‌మెంటులో టీఆర్ ఎస్ ఎలాంటి వ్యూహం అనుస‌రిస్తుంద‌ని ప్ర‌తిప‌క్షాలు ఇప్ప‌టికే ప్ర‌శ్న‌లు సంధిస్తున్నాయి. రాష్ర్టానికి అన్యాయం జ‌రుగుతున్న ఇలాంటి ప‌రిస్థితుల్లో.. కేంద్రంతో సంధి చేసుకుని మ‌ద్ద‌తిచ్చి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకోవాలా? లేక తాడోపేడో తేల్చుకునేందుకు జీఎస్టీకి మ‌ద్ద‌తివ్వ‌కుండా ఉండాలా? అన్న రెండు మార్గాలు గులాబీ పార్టీ ముందున్నాయి. వీటిలో దేన్ని ఎంచుకుంటుందన్న విష‌యంపై ఇప్ప‌టికే కాంగ్రెస్ నేత ష‌బ్బీర్ అలీ, ఎంపీ రాపోలు ఆనంద్ భాస్క‌ర్‌లు మీడియా ముందే కేసీఆర్‌ను నిల‌దీశారు.
ఈ వివాదాన్ని మొద‌ట ప్రారంభించింది బీజేపీ నేత‌లే. టీడీపీ ప్ర‌భావ‌మో.. లేక స‌ర్కారును ఎండ‌గ‌ట్టే ప్ర‌య‌త్నంలో దూకుడుగా ఉండాల‌నుకున్నారో ఏమోగానీ.. రాష్ట్ర బీజేపీ శాఖ తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ప‌దేప‌దే ఎండ‌గ‌ట్ట‌డం మొదలు పెట్టింది. కేంద్రం రూ.వేల‌కోట్లు ఇస్తుంటే.. ఏం చేస్తున్నార‌ని లెక్క‌లు అడ‌గ‌డ‌టం ప్రారంభించారు. ఇటీవ‌ల సూర్యాపేట‌లో బీజేపీ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో ఆ పార్టీ జాతీయాధ్య‌క్షుడు తెలంగాణ అభివృద్ధి త‌మ‌దేన‌ని బ‌డాయి పోయాడు. రాష్ర్టానికి రూ.90 వేల కోట్లు నిధులు ఇచ్చామ‌ని గొప్ప‌లు చెప్పాడు. బీజేపీ రాష్ట్ర శాఖ మాట‌ల‌ను లైట్ తీసుకున్న తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద‌ర్‌.. అమిత్‌షాకు మాత్రం దిమ్మ తిరిగే స‌మాధానం ఇచ్చాడు. కేంద్రం వ‌ద్ద రాష్ర్టాలు అడుక్కోవ‌డం లేద‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని స‌మాధానం ఇచ్చాడు. మేం క‌ట్టే ప‌న్నుల్లో మాకు న్యాయంగా రావాల్సిన నిధుల్నే కేంద్రం ఇస్తుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోవ‌ద్ద‌ని స్ప‌ష్టం చేశాడు. ఇవ్వ‌ని నిధుల‌ను ఇచ్చిన‌ట్లుగా చెప్పుకోవ‌డాన్ని ఆయ‌న తీవ్రంగా త‌ప్పుబ‌ట్టాడు. లెక్క‌ల‌తో స‌హా.. అమిత్ షా చెప్పిన‌వి అవాస్త‌వాల‌ని తేల్చాడు.
రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు.. శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రు. జీఎస్టీ బిల్లు ఆమోదానికి టీఆర్ ఎస్ ఎంపీల మ‌ద్దతు అవ‌స‌రం. ఇప్పుడు టీఆర్ ఎస్ ఎంపీల సంఖ్య వ‌ల‌స‌వ‌చ్చిన‌వారితో క‌లిపి ఇప్పుడు 17 మందికి చేరుకుంది. మ‌రి ఇంత విలువైన మిత్రుడితో కేంద్రం స‌యోధ్య‌కు వ‌స్తుందా? అవ‌స‌రం లేదనుకుంటుందా? అన్న విష‌యం కూడా ఆస‌క్తిరేకెత్తిస్తోంది.
First Published:  29 Jun 2016 11:07 PM GMT
Next Story