Telugu Global
NEWS

రేవంత్ రెడ్డిని అచ్చెన్నాయుడు పూనాడా? 

ప్ర‌త్య‌ర్థుల‌పై మాట‌ల కంటే కటువుగా ఉండే వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌తో చెల‌రేగిపోవ‌డం కొంద‌రు టీడీపీ నేత‌ల ప్ర‌త్యేక‌త‌. ఈ విషయంలో ఆపార్టీలో ఇద్ద‌రు నేత‌ల‌ది అందెవేసిన చేయి. ఆ నేత‌లు ఏపీ సీఎం చంద్ర‌బాబుకు న‌మ్మిన‌బంట్లు. ఆయ‌న కోసం .. రాజ్యాంగ‌బ‌ద్ద ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తినైనా స‌రే.. వ్య‌క్తిగ‌తంగా దూషించేందుకు వెన‌కాముందు ఆలోచించ‌రు. వారే.. ఒక‌రు అచ్చెన్నాయుడు, మ‌రొక‌రు ఓటుకునోటు కేసు ప్ర‌ధాన నిందితుడు రేవంత్ రెడ్డి. వీరిద్ద‌రూ త‌మ అధినేత‌పై ఈగ వాల‌నీయ్య‌రు. ఉమ్మ‌డి హైకోర్టు విభ‌జ‌న […]

రేవంత్ రెడ్డిని అచ్చెన్నాయుడు పూనాడా? 
X
ప్ర‌త్య‌ర్థుల‌పై మాట‌ల కంటే కటువుగా ఉండే వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌తో చెల‌రేగిపోవ‌డం కొంద‌రు టీడీపీ నేత‌ల ప్ర‌త్యేక‌త‌. ఈ విషయంలో ఆపార్టీలో ఇద్ద‌రు నేత‌ల‌ది అందెవేసిన చేయి. ఆ నేత‌లు ఏపీ సీఎం చంద్ర‌బాబుకు న‌మ్మిన‌బంట్లు. ఆయ‌న కోసం .. రాజ్యాంగ‌బ‌ద్ద ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తినైనా స‌రే.. వ్య‌క్తిగ‌తంగా దూషించేందుకు వెన‌కాముందు ఆలోచించ‌రు. వారే.. ఒక‌రు అచ్చెన్నాయుడు, మ‌రొక‌రు ఓటుకునోటు కేసు ప్ర‌ధాన నిందితుడు రేవంత్ రెడ్డి. వీరిద్ద‌రూ త‌మ అధినేత‌పై ఈగ వాల‌నీయ్య‌రు. ఉమ్మ‌డి హైకోర్టు విభ‌జ‌న విష‌యంలో సీఎం చంద్ర‌బాబే నిర్ణ‌యం తీసుకోవాల‌ని కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి స్ప‌ష్టం చేయ‌డంతో ఊరుకుంటారా? వెంట‌నే త‌మ స్వామిభ‌క్తిని చాటుకునేందుకు బ‌య‌ల్దేరాడు రేవంత్ రెడ్డి. ఒక్క‌రోజు కూడా తెలంగాణ న్యాయాధికారుల పోరాటంపై నోరు మెద‌ప‌ని రేవంత్‌..ఉన్న‌ప‌ళంగా బాబుపై ఒక్క ఆరోప‌ణ రాగానే.. విమ‌ర్శ‌ల‌తో చెల‌రేగిపోయాడు.
హైకోర్టు విభ‌జ‌న అంశం తేల్చ‌కుండా గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ దావ‌త్‌ల‌తో కాలం గ‌డుపుతున్నాడంటూ ఆయ‌న హోదాను కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేశాడు రేవంత్‌. న్యాయ‌వాదులు, న్యాయ‌మూర్తుల ఆందోళ‌న‌ల‌తో రాష్ట్రం ర‌గిలిపోతోంటే.. గ‌వ‌ర్న‌ర్ మౌనంగా ఉండిపోవ‌డం త‌గ‌ద‌ని హిత‌బోధ చేశాడు. హైకోర్టు విభ‌జ‌న‌ను చంద్ర‌బాబుకు అంట‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేయ‌వద్ద‌ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి స‌దానంద గౌడ వ్యాఖ్య‌ల‌పై అభ్యంత‌రం తెలిపాడు. అంతేకాదు.. హైకోర్టును విభ‌జించాలంటూ చంద్ర‌బాబు 2014లోనే లేఖ రాశాడంటూ కొత్త విష‌యం వెల్ల‌డించాడు. ఈవ్యాఖ్య‌ల‌పై తెలంగాణ‌వాదులు, మేధావులు మండిప‌డుతున్నారు. హైకోర్టు విభ‌జ‌న‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌కుండా.. దానికి కార‌ణ‌మైన వ్య‌క్తిని వెన‌కేసుకురావ‌డం ఏంటి? అని వాపోతున్నారు. రేవంత్ రెడ్డిని అచ్చెన్నాయుడు పూనాడ‌ని, అందుకే ఇలా దిగ‌జారుడు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ధ్వ‌జమెత్తుతున్నారు. రాష్ట్ర ప్ర‌థ‌మ పౌరుడి హోదాను కించ‌ప‌రిచేలా మాట్లాడ‌టం త‌గ‌ద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. గ‌తేడాది.. ఓటుకునోటు కేసు బ‌య‌ట‌ప‌డ‌టంతో చంద్ర‌బాబు అనుచ‌రులు చెల‌రేగిపోయారు. ఉమ్మ‌డి హైద‌రాబాద్‌లో సెక్ష‌న్ -8 అమ‌లు చేయాలంటూ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహాన్ పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చేదుకు ప్ర‌య‌త్నించారు. వారిలో అచ్చెన్నాయుడు ఏకంగా గ‌వ‌ర్న‌ర్‌ను గంగిరెద్దు అని సంభోదించారు. త‌రువాత క‌నీసం త‌న మాట‌ల ప‌ట్ల క‌నీస ప‌శ్చాతాపం వ్య‌క్తం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Click on Image to Read:

somireddy chandramohan reddy

uma-shankar-goud

ys-jagan-ed

ys-jagan

kodela-advertisements

lokesh

mysura-reddy

balakrishna-road-accident-i

lokesh revanth

speaker-kodela

vishals reddy varalakshmi

somu-veeraju

First Published:  29 Jun 2016 10:03 PM GMT
Next Story