Telugu Global
NEWS

రేవంత్ దూకుడు.. ర‌మ‌ణ‌కు త‌ల‌నొప్పులు!

తెలంగాణ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాంచి దూకుడు మీద ఉన్నాడు. ఓటుకు నోటు కేసు త‌రువాత ఆయ‌న‌లో దూకుడు మ‌రింత‌గా పెరిగింది. పార్టీలో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించాక ఎవ‌రిమాట విన‌డం లేద‌ని సొంత‌పార్టీ నేత‌లే ఆరోపిస్తున్నారు. ఇటీవ‌ల ఈయ‌న దూకుడు కార‌ణంగా.. పార్టీ సీనియ‌ర్ల‌కు త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయ‌ట‌. అత‌నికతనే సొంత నిర్ణ‌యాలు తీసుకుని, పార్టీ ఎజెండాను ప‌క్క‌న బెట్టి, వ్య‌క్తిగ‌త‌ ఎజెండాతో ముందుకు వెళ్తున్నార‌ని సొంత పార్టీ నేత‌లే విమ‌ర్శిస్తున్నారు. సీనియ‌ర్ల మాట […]

తెలంగాణ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాంచి దూకుడు మీద ఉన్నాడు. ఓటుకు నోటు కేసు త‌రువాత ఆయ‌న‌లో దూకుడు మ‌రింత‌గా పెరిగింది. పార్టీలో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించాక ఎవ‌రిమాట విన‌డం లేద‌ని సొంత‌పార్టీ నేత‌లే ఆరోపిస్తున్నారు. ఇటీవ‌ల ఈయ‌న దూకుడు కార‌ణంగా.. పార్టీ సీనియ‌ర్ల‌కు త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయ‌ట‌. అత‌నికతనే సొంత నిర్ణ‌యాలు తీసుకుని, పార్టీ ఎజెండాను ప‌క్క‌న బెట్టి, వ్య‌క్తిగ‌త‌ ఎజెండాతో ముందుకు వెళ్తున్నార‌ని సొంత పార్టీ నేత‌లే విమ‌ర్శిస్తున్నారు. సీనియ‌ర్ల మాట అస్స‌లు విన‌డం లేద‌ని, ఇంత దూకుడు ప‌నికిరాద‌ని చెప్పుకుంటున్నారు.
రేవంత్ స్పీడుపై సీనియ‌ర్లు గుర్రుగా ఉన్నారు. తెలంగాణ తెలుగుదేశం అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ అయిన‌ప్ప‌టికీ కొంత‌కాలంగా ఆయ‌న ఆదేశాలను రేవంత్ అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల మ‌ల్ల‌న్న సాగ‌ర్ భూ నిర్వాసితుల‌కు చేసిన దీక్ష కూడా పార్టీ ఆదేశాల‌కు ధిక్క‌రించి చేసింద‌ని ర‌మ‌ణ స‌న్నిహితుల వ‌ద్ద వాపోయిన‌ట్లు తెలిసింది. అస‌లేం జ‌రిగిందంటే.. తెలంగాణ‌లో పెరిగిన బ‌స్సు ఛార్జీలు, విద్య‌త్తు ఛార్జీలపై నిర‌స‌న‌లు తెల‌పాల‌ని ఎల్‌.ర‌మ‌ణ నిర్ణ‌యించారు. ఇదే ఆదేశాలు.. రేవంత్ కు చేరవేశారంట‌. కానీ, రేవంత్ మాత్రం ర‌మ‌ణ ఆదేశాలు పెడ‌చెవిన పెట్టి మ‌ల్ల‌న్న సాగ‌ర్ వ‌ద్ద దీక్ష‌కే మొగ్గుచూపిన‌ట్లు తెలిసింది. పైగా అక్క‌డ దీక్ష చేస్తోన్న స‌మ‌యంలో వేదికపై క‌ట్టిన ప్లెక్సీ విష‌యం కూడా వివాదంగా మారింది. ఆ ప్లెక్సీలో తెలంగాణ తెలుగుదేశం అధ్య‌క్షుడు ర‌మ‌ణ చిత్రం ఎక్క‌డా లేక‌పోవ‌డం ఆయ‌న్ను నొచ్చుకునేలా చేసిందట‌. పార్టీ అధ్య‌క్షుడిగా త‌న ఆదేశాలు ధిక్క‌రించ‌డ‌మే కాకుండా.. దీక్ష వేదిక‌పై క‌ట్టిన ప్లెక్సీపై త‌న చిత్రం లేక‌పోవ‌డం ర‌మ‌ణ కోపాన్ని మ‌రింత పెంచిందట‌. పార్టీ ఎజెండాను కాద‌ని, సొంత ఎజెండా, వ్య‌క్తిగ‌త నిర్ణ‌యాలు తీసుకోవ‌డం పార్టీ నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని సొంత పార్టీ నేత‌ల‌తో ర‌మ‌ణ వాపోయిన‌ట్లు తెలిసింది. అందుకే, ఈ విషయాన్ని బాబు దృష్టికి తీసుకెళ్లాల‌ని సీనియ‌ర్లంతా నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలిసింది.
First Published:  30 Jun 2016 11:21 PM GMT
Next Story