Telugu Global
Others

తెలుగు వాళ్ల‌కు టూర్లు ఇష్టం ఉండ‌వ‌ట‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల తెలుగు ప్ర‌జ‌లు త‌మ ప్రాంతాన్ని దాటి యాత్ర‌ల‌కు వెళ్లేందుకు ఆస‌క్తి చూప‌డం లేద‌ని శాంపిల్ స‌ర్వే కార్యాల‌యం తెలియ‌జేసింది. 2014-15 సంవ‌త్స‌రానికి గాను, నిర్వ‌హించిన స‌ర్వేలో ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు వెల్ల‌డయ్యాయి. ఆ ఏడాది కాలంలో కేవ‌లం 8.1 శాతం మంది ప్ర‌జ‌లు మాత్ర‌మే టూర్ల‌కు, ఆట‌విడుపు యాత్ర‌ల‌కు, వైద్య అవ‌స‌రాల కోసం పొరుగు రాష్ట్రాల‌కు వెళ్లిన‌ట్టు స‌ర్వే వెల్ల‌డించింది.ద‌క్షిణ భార‌త దేశంలో ఆట‌విడుపు కోసం టూర్ల‌కు వెళ్లిన వారి సంఖ్య తెలుగు […]

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల తెలుగు ప్ర‌జ‌లు త‌మ ప్రాంతాన్ని దాటి యాత్ర‌ల‌కు వెళ్లేందుకు ఆస‌క్తి చూప‌డం లేద‌ని శాంపిల్ స‌ర్వే కార్యాల‌యం తెలియ‌జేసింది. 2014-15 సంవ‌త్స‌రానికి గాను, నిర్వ‌హించిన స‌ర్వేలో ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు వెల్ల‌డయ్యాయి. ఆ ఏడాది కాలంలో కేవ‌లం 8.1 శాతం మంది ప్ర‌జ‌లు మాత్ర‌మే టూర్ల‌కు, ఆట‌విడుపు యాత్ర‌ల‌కు, వైద్య అవ‌స‌రాల కోసం పొరుగు రాష్ట్రాల‌కు వెళ్లిన‌ట్టు స‌ర్వే వెల్ల‌డించింది.ద‌క్షిణ భార‌త దేశంలో ఆట‌విడుపు కోసం టూర్ల‌కు వెళ్లిన వారి సంఖ్య తెలుగు వాళ్ల‌లోనే త‌క్కువ‌గా ఉంద‌ని స‌ర్వే తెలిపింది. ఒంట‌రిగా టూర్ల‌కు వెళ్తున్న మ‌హిళ‌ల్లో మాత్రం తెలుగు రాష్ట్రాల వారే టాప్‌లో ఉన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి 53 శాతం మంది మ‌హిళ‌లు, తెలంగాణ నుంచి 60 శాతం మంది మ‌హిళ‌లు ఒంట‌రిగా టూర్ల‌కు వెళ్లార‌ని ఆ సంస్థ తెలిపింది.
First Published:  1 July 2016 3:00 PM GMT
Next Story