Telugu Global
International

బంగ్లాలో రెస్టారెంట్‌పై ఐఎస్ ఐఎస్ ఉగ్ర‌దాడి: 20 మంది మృతి

అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాద సంస్థ .. ఐఎస్ ఐఎస్ ఉగ్ర‌వాదులు బంగ్లాదేశ్ రాజ‌ధానిలో మరోసారి పంజా విసిరారు. దేశ‌రాజ‌ధాని ఢాకా న‌గ‌రంలో దౌత్య‌వేత్త‌లు నివ‌సించే ప్రాంతంలో ఉన్న హోలీ రెస్టారెంట్‌పై ఉగ్ర‌వాదులు చొర‌బ‌డి విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పులు జ‌రిపారు. విదేశీయులే ల‌క్ష్యంగా చేసుకుని జ‌రిపిన ఈ దాడుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 20 మంది మృతి చెందారు. ఈ దాడిలో సుమారు 10 మంది ఉగ్ర‌వాదులు పాల్గొన్న‌ట్లు తెలిసింది. రెస్టారెంట్‌లో ఉన్న‌ 20 మందిని ఉగ్ర‌వాదులు బంధీలుగా ప‌ట్టుకున్నారు. […]

బంగ్లాలో రెస్టారెంట్‌పై ఐఎస్ ఐఎస్ ఉగ్ర‌దాడి: 20 మంది మృతి
X
అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాద సంస్థ .. ఐఎస్ ఐఎస్ ఉగ్ర‌వాదులు బంగ్లాదేశ్ రాజ‌ధానిలో మరోసారి పంజా విసిరారు. దేశ‌రాజ‌ధాని ఢాకా న‌గ‌రంలో దౌత్య‌వేత్త‌లు నివ‌సించే ప్రాంతంలో ఉన్న హోలీ రెస్టారెంట్‌పై ఉగ్ర‌వాదులు చొర‌బ‌డి విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పులు జ‌రిపారు. విదేశీయులే ల‌క్ష్యంగా చేసుకుని జ‌రిపిన ఈ దాడుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 20 మంది మృతి చెందారు. ఈ దాడిలో సుమారు 10 మంది ఉగ్ర‌వాదులు పాల్గొన్న‌ట్లు తెలిసింది. రెస్టారెంట్‌లో ఉన్న‌ 20 మందిని ఉగ్ర‌వాదులు బంధీలుగా ప‌ట్టుకున్నారు. వీరిలో ఒక భార‌తీయుడు కూడా ఉన్నాడు. వివిధ దేశాల దౌత్య‌వేత్త‌లు ఈ ప్రాంతంలో నివ‌సిస్తారు. దీంతో విదేశీయుల‌ను దారుణంగా హ‌త‌మార్చేందుకే ఉగ్ర‌వాదులు ఈ దాడికి వ్యూహం ప‌న్నిన‌ట్లు స్ప‌ష్ట‌మైంది.
హోలీ రెస్టారెంట్‌ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు చుట్టుముట్టాయి. బ‌ల‌గాల‌కు ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య కాల్పులు కొన‌సాగుతున్నాయి. ఎలాగైనా బంధీలను ప్రాణాల‌తో విడిపించాల‌ని బంగ్లాసైన్యం శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ ఆప‌రేష‌న్‌ను బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనా స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఢాకాలో ఉన్న భార‌తీయ అధికారులెవ‌రూ ఎంబ‌సీ దాటి బ‌య‌టికి రావ‌ద్ద‌ని భార‌త విదేశాంగ శాఖ హెచ్చ‌రించింది. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింద‌ని ఐఎస్ ఐఎస్ ఉగ్ర‌వాదులేనని స‌మాచారం. ఇదే స‌మ‌యంలో ఈ దాడి తామే చేశామంటూ మ‌రో ఉగ్ర‌వాద సంస్థ అల్‌ఖైదా కూడా ప్ర‌క‌టించుకోవ‌డం విశేషం. లోప‌ల ఉగ్ర‌వాదులు బంధీలుగా ప‌ట్టుకున్న వారి క్షేమ స‌మాచారంపై బంగ్లాతోపాటు ప్ర‌పంచ‌దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.
First Published:  1 July 2016 11:07 PM GMT
Next Story