మెగా ఫ్యాన్స్ కు కోపం తెప్పించిన నిహారిక కోరిక‌

మెగా హీరోలకు దగ్గరవుతున్నాడంటూ ఈమధ్య ఎన్టీఆర్ పై నందమూరి ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అలాంటిదే ఓ సన్నివేశం ఇప్పుడు రివర్స్ లో జరిగింది. నందమూరి హీరో గురించి ప్రస్తావించినందుకు మెగా హీరోయిన్ నిహారికపై మెగాభిమానులు గుస్సా అవుతున్నారు. ఇంకెప్పుడు అలాంటి ప్రకటనలు ఇవ్వొద్దని కాస్త గట్టిగానే హెచ్చరిస్తున్నారు. మెగా డాటర్ నిహారిక ఇచ్చిన సమాధానం తో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురౌతున్నారు. ఇక కొంతమంది హార్డ్ కోర్ మెగా ఫ్యాన్స్ అయితే నిహారిక పై మండిపడుతున్నారు . నిహారిక పై మెగా ఫ్యాన్స్ కోపానికి కారణం ఒకటే… ఆమె ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుందని ప్రకటించడమే. తారక్ సరసన నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు నిహారిక ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల ఒక మనసు సినిమాకి సంబంధించి ప్రమోషన్ లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఎన్టీఆర్ తో నటించాలని ఉందని నిహారిక చెప్పింది. అదే సమయంలో చిరంజీవి, పవన్ కల్యాణ్ సినిమాల్లో కూడా నటించాలని ఉందని నిహారిక చెప్పినప్పటికీ…దాన్ని ఫ్యాన్స్ పట్టించుకోలేదు. తారక్ పేరు ప్రస్తావించినందుకు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

Click on Image to Read:

rgv

chandrbabu-naidu

ramzan-thofa-ghee

mla-raghurami-reddy

kurnool-kota

ap NCAER report

ktr twitter

arun-jaitly-chandrababu-mee

jc-diwakar-reddy

narasimha-rao-on-jaga

ys-jagan-case