వెంకీకి పెద్ద అడ్డుగా మారిన సూపర్ స్టార్

బాబు బంగారం సినిమాతో దుమ్ముదులపాలని చూస్తున్నాడు వెంకటేష్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ కూడా భలే ఆకట్టుకుంది. ఇక సినిమాను విడుదల చేయడమే ఆలస్యం అనుకుంటున్న టైమ్ లో… అడ్డంగా రజనీకాంత్ వచ్చాడు. తన కబాలి సినిమాను రేసులో నిలిపాడు. దీంతో వెంకీకి ఎటూ పాలుపోవడం లేదు. కనీసం కబాలి రిలీజ్ డేట్ తెలిసినా.. తన సినిమా విడుదలను దానికి తగ్గట్టు మార్చుకునేవాడు. కానీ కబాలి రిలీజ్ మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంది.

కబాలి జూలై 15న రిలీజ్ అవుతుందని, బాబు బంగారాన్ని జూలై 29న విడుదల చేయాలని మొదట నిర్ణయించారట. ఇక ఇప్పుడేమో కబాలి సినిమా విడుదల‌యేటట్టు కనిపించడం లేదు. ప్రస్తుతం నడుస్తున్న రూమర్ల ప్రకారం… జూలై 22న రిలీజ్ కాబోతుందని అంటున్నారు. మరికొందరు ఆగస్ట్ కు వాయిదా పడేలా ఉందని వాదిస్తున్నారు. దీంతో బాబు బంగారానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అన్ని పనులు పూర్తి చేసుకుని రెడీగా ఉన్న వెంకీకి…. కబాలి రిలీజ్ డేట్ విషయంలో సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు.