Telugu Global
Cinema & Entertainment

త్రివిక్ర‌మ్ మెచ్చిన అవ‌స‌రానికో అబ‌ద్దం...

‘అవసరానికో అబద్ధం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్న చిత్ర ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేసారు. ఈ చిత్రానికి సురేష్ కెవి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ…’అవసరానికో అబద్ధం చిత్ర ట్రైలర్ చాలా బాగుంది. ముఖ్యంగా డైలాగ్స్ బాగా నచ్చాయి. సినిమాను బాగా ప్రమోట్ చేసి, మౌత్ పబ్లిసిటీతో సినిమా విజయవంతం అయ్యేలా ప్రయత్నించండి. అప్పట్లో మా స్వయంవరం చిత్రం టాక్ కూడా స్లోగా స్టార్ట్ అయ్యి […]

త్రివిక్ర‌మ్ మెచ్చిన అవ‌స‌రానికో అబ‌ద్దం...
X

‘అవసరానికో అబద్ధం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్న చిత్ర ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేసారు. ఈ చిత్రానికి సురేష్ కెవి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ…’అవసరానికో అబద్ధం చిత్ర ట్రైలర్ చాలా బాగుంది. ముఖ్యంగా డైలాగ్స్ బాగా నచ్చాయి. సినిమాను బాగా ప్రమోట్ చేసి, మౌత్ పబ్లిసిటీతో సినిమా విజయవంతం అయ్యేలా ప్రయత్నించండి. అప్పట్లో మా స్వయంవరం చిత్రం టాక్ కూడా స్లోగా స్టార్ట్ అయ్యి బాగా పికప్ అందుకొని విజయవంతంగా 175 రోజులు పూర్తి చేసుకుంది. అవసరానికో అబద్ధం చిత్ర యూనిట్ అందరికీ ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను’ అన్నారు.

చిత్ర రచయిత, దర్శకుడు సురేష్ కెవి మాట్లాడుతూ… మా అవసరానికో అబద్ధం చిత్ర ట్రైలర్ ను లాంచ్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. సినిమాలోని డైలాగ్స్ ను మాటల మాంత్రికుడు మెచ్చుకోవడం మాకు పెద్ద కాంప్లిమెంట్. నాపై ఉన్న నమ్మకంతో చిత్రాన్ని నిర్మించిన నా స్నేహితులకు… సినిమా అనుకున్నది అనుకున్నట్టుగా రావడానికి కృషి చేసిన మా టీంకు, సినిమాపై ఉన్న నమ్మకంతో ప్రమోషనల్ పార్ట్ నర్ గా వ్యవహరిస్తున్న శ్రియాస్ మీడియాకు కృతజ్ఞతలు తెలిజయేస్తున్నాను అన్నారు.

First Published:  3 July 2016 8:20 AM GMT
Next Story