నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డికి గుండెపోటు వచ్చింది. హఠాత్తుగా పోటు రావడంతో ఆయనను హుటాహుటీన నంద్యాలలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు అక్కడ భూమానాగిరెడ్డికి చికిత్స అందించారు.. భూమా గుండెపోటుకు గురైన విషయం తెలుసుకుని ఆయన బంధువులు, అనుచరులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఇది వరకే ఒకసారి భూమాకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం భూమా నాగిరెడ్డి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇఫ్తార్ విందుకు వెళ్లి వస్తున్న సమయంలో భూమాకు గుండెపోటు వచ్చింది. మానసిక ఒత్తిడి, వివిధ ప్రాంతాల్లో పర్యటనల కారణంగా భూమా ఆరోగ్యం ఇలా అయినట్టు భావిస్తున్నారు.
Click on Image to Read: