Telugu Global
Family

రామరామ !

పూర్వం ఒక నగరంలో ధనవంతులయిన అన్నదమ్ములు ఉండేవాళ్లు. కలిసే ఉండే వాళ్లు. అన్న గొప్ప ధర్మాత్ముడుగా పేరుపొందాడు. దానధర్మాలు చేస్తూ గుళ్లూ,గోపురాలు తిరుగుతూ గొప్ప భక్తుడిగా పేరుపొందాడు. అతని చుట్టూ ఎప్పుడూ సన్యాసులూ,సాధువులూ గుంపుగా ఉండేవాళ్లు. అతడిని పొగుడుతుండేవాళ్లు. అతనికి స్వర్గంలో స్థానం ఖాయం అని నమ్మకంగా చెప్పేవాళ్లు. అతను పురాణగాథలు వింటూ పరవశించేవాడు. రంతిదేవుడు, శిబిచక్రవర్తి,కర్ణుడు మొదలయిన వాళ్ల దాన గుణం వింటూ తానూ అంతటవాడనుకునేవాడు. అతనికి రామనామమంటే ఎంతో ప్రాణం. నిత్యం రామనామస్మరణలో లీనమయి ఉండేవాడు. […]

పూర్వం ఒక నగరంలో ధనవంతులయిన అన్నదమ్ములు ఉండేవాళ్లు. కలిసే ఉండే వాళ్లు. అన్న గొప్ప ధర్మాత్ముడుగా పేరుపొందాడు. దానధర్మాలు చేస్తూ గుళ్లూ,గోపురాలు తిరుగుతూ గొప్ప భక్తుడిగా పేరుపొందాడు. అతని చుట్టూ ఎప్పుడూ సన్యాసులూ,సాధువులూ గుంపుగా ఉండేవాళ్లు. అతడిని పొగుడుతుండేవాళ్లు. అతనికి స్వర్గంలో స్థానం ఖాయం అని నమ్మకంగా చెప్పేవాళ్లు. అతను పురాణగాథలు వింటూ పరవశించేవాడు. రంతిదేవుడు, శిబిచక్రవర్తి,కర్ణుడు మొదలయిన వాళ్ల దాన గుణం వింటూ తానూ అంతటవాడనుకునేవాడు. అతనికి రామనామమంటే ఎంతో ప్రాణం. నిత్యం రామనామస్మరణలో లీనమయి ఉండేవాడు. కానీ అతని తమ్ముడు దీనికి పూర్తిగా వ్యతిరేకం. అతనికి భక్తిగిక్తీ ఉండేదికాదు. అతను ఆనందంగా,హాయిగా తిరుగుతూ ఉండేవాడు. విందులు,విలాసాలలో మునిగితేలుతూ వుండేవాడు. అన్నగారు ఏర్పాటుచేసే భక్తి సమావేశాలవైపు కన్నెత్తి కూడా చూసేవాడు కాడు. అన్నకు ఎప్పుడూ తమ్ముడు గురించి దిగులు, తన తమ్ముడు చెడిపోతున్నాడని, కానీ తమ్ముడు ఇవేవీ పట్టించుకోకుండా హాయిగా ఉండేవాడు. భగవన్నామస్మరణ లేకుండా జీవితానికి ఎలా ముక్తి వస్తుందని అన్న బాధ. జీవిస్తేచాలు, తక్కినవన్నీ అర్ధం లేనివని తమ్ముడి ఉద్ధేశం.

అన్న డబ్బు సంపాదించడానికి జనాన్ని పీడించేవాడు. సన్యాసులు అతన్ని పీడించేవాళ్లు. దానం చెయ్యందే పుణ్యం రాదు. దానం చెయ్యాలంటే ధనం కావాలి. ధనం కావాలంటే జనాల్ని పీడించక తప్పదు. ఎందుకంటే ఎవర్నీ బాధ పెట్టకుండా డబ్బు సంపాదించలేం. కాబట్టి దానం చేసేవాళ్లు. తీసుకునేవాళ్లు ఒకే రకం. తమ్ముడు ఉల్లాసంగా సంపాదించడం, దానం చేయడం వీటికి దూరంగా గడిపేవాడు. అన్నకు తమ్ముడి గురించి దిగులు పట్టుకుంది. అతనికి దైవ భీతి ఉండేలా చెయ్యాలని కంకణం కట్టుకున్నాడు. అతనిచేత రామరామ స్మరణ చేయిస్తే తన జన్మ ధన్యమవుతుందని భావించాడు. అప్పుడు ఆ నగరానికి ఒక మహాత్ముడు వచ్చాడని, ఆయన గొప్ప శక్తి సామర్థ్యాలున్నవాడని విన్నాడు. వెంటనే వెళ్లి ఆ గురువుకు నమస్కరించి తన సమస్య చెప్పాడు. ఆ గురువు పూర్వాశ్రమంలో బలమైన వస్తాదు. వస్తాదుగా ఉండడం కన్నా సన్యాసిగా ఉండడం లాభసాటి వ్యాపారం అనిపించడం వల్ల సన్యాసిగా మారాడు. అన్న చెప్పినవన్నీ విని గురువు ”నీకెందుకు మీ తమ్ముడి నోటివెంట రామనామం చెప్పించాలి అంతే కదా?” అన్నాడు. అన్న ”స్వామీ! మీరాపని చేసి పుణ్యం కట్టుకోండి. మీకు జన్మాంతం రుణపడిఉంటాను” అన్నాడు. గురువు ఆ ధనవంతుని ఇంటికి అతిథిగా వచ్చాడు. ఎప్పట్లాగే సాధువులు చుట్టూ చేరారు.

సత్కాలాక్షేపంతో వారం రోజులు గడిచాయి. తమ్ముడు గమనించాడు. కానీ దూరం నుంచి చూస్తూ వెళుతూ ఉండేవాడు. ఒక రోజు గురువు తమ్ముణ్ని పిలిచాడు. తమ్ముడు వచ్చాడు. గురువు కూచోమని చెప్పి హితబోధ చేశాడు. తమ్ముడు పట్టించుకోలేదు. లేచి వెళ్లబోతే గురువు అతన్ని రెండు చేతుల్తో ఒడిసిపట్టి కిందకి తోసి పైనకూచుని ”మర్యాదగా రామరామ! అంటావా లేదా? ” అన్నాడు. ధైర్యం ఉన్న తమ్ముడు ”మీరు నా పీక నొక్కినా నేను రామరామ అనను” అన్నాడు. గురువు వదిలేశాడు. తమ్ముడు దుమ్ము దులుపుకుని లేచి వెళ్లిపోయాడు. గురువు అన్నవేపు తిరిగి ”చూశారా? ఒక్కసారి కాదు మీ తమ్ముడిచేత రెండు సార్లు రామరామ అనిపించాను” అన్నాడు. గురువు సామర్థ్యానికి సంతోషించిన అన్న గురువును సత్కరించాడు.

– సౌభాగ్య

First Published:  2 July 2016 1:01 PM GMT
Next Story