Telugu Global
Cinema & Entertainment

అర్ధ‌నారి ద‌ర్శ‌కుడి ప్ర‌య‌త్నం నాట్ బాడ్..

చిన్న చిత్రం.. స్టార్ కాస్టింగ్ లేని చిత్రం అంటే ఆడియ‌న్స్ కు పెద్ద ఆస‌క్తి ఉండదు. అయితే క‌థ‌, క‌థ‌నాలు బ‌లంగా ఉంటే మౌత్ టాక్ ద్వారా సినిమా ఆడియ‌న్స్ కు బాగానే రీచ్ అవుతుంది. అటువంటి ఒక ప్ర‌య‌త్న‌మే అర్ధ‌నారి చిత్రంతో కొత్త ద‌ర్శ‌కుడు భానుశంక‌ర్ చేశాడు. సాధారణంగా మన తెలుగు పరిశ్రమలో ఇప్పటి వరకూ హిజ్రాల పాత్రతో పెద్దగా సినిమాలు వచ్చిన దాఖలాలు లేవు. అలాంటి సినిమాలు ఏవైనా వచ్చాయి అంటే అవన్నీ తమిళ […]

అర్ధ‌నారి ద‌ర్శ‌కుడి ప్ర‌య‌త్నం నాట్ బాడ్..
X

చిన్న చిత్రం.. స్టార్ కాస్టింగ్ లేని చిత్రం అంటే ఆడియ‌న్స్ కు పెద్ద ఆస‌క్తి ఉండదు. అయితే క‌థ‌, క‌థ‌నాలు బ‌లంగా ఉంటే మౌత్ టాక్ ద్వారా సినిమా ఆడియ‌న్స్ కు బాగానే రీచ్ అవుతుంది. అటువంటి ఒక ప్ర‌య‌త్న‌మే అర్ధ‌నారి చిత్రంతో కొత్త ద‌ర్శ‌కుడు భానుశంక‌ర్ చేశాడు. సాధారణంగా మన తెలుగు పరిశ్రమలో ఇప్పటి వరకూ హిజ్రాల పాత్రతో పెద్దగా సినిమాలు వచ్చిన దాఖలాలు లేవు. అలాంటి సినిమాలు ఏవైనా వచ్చాయి అంటే అవన్నీ తమిళ డబ్బింగ్ సినిమాలే. అవి కూడా దాదాపు అన్నీ హారర్ బేస్డ్ థీమ్ తో వచ్చి మనల్ని భయపెట్టిన సినిమాలే. మరిప్పుడు మన తెలుగులో కొత్త దర్శకుడు భాను శంకర్ హిజ్రా పాత్రను ప్రధానంగా తీసుకుని కొత్త నటీ నటులైన అర్జున్ యజత్, మౌర్యాని జంటగా సోషల్ ఎలిమెంట్స్ తో ‘అర్థనారి’ అనే సినిమాని తెరకెక్కించారు.

బాధ్య‌త లేని వాడు దేశంలో బ్ర‌త‌క కూడ‌దు అనేది ఈ చిత్రంలో క‌థ నాయ‌కుడు న‌మ్మే సిద్దాంతం. అదే సిద్దంతాన్ని ఆర‌చ‌ణ‌లో పెడుతున్న‌ప్పుడు ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటాడు. కుటుంబాన్ని, భార్య‌ను, బిడ్డ‌ను పొగొట్టుకుంటాడు. చివ‌ర‌కు అర్ధ‌నారి గా మారి ఏం చేశాడు అన్న‌దే పాయింట్. ద‌ర్శ‌కుడు ప్ర‌థ‌మార్ధం బాగా న‌డిపించాడు. సెకండాఫ్ లో హీరో ఎందుకు అర్ధ‌నారి అయ్యాడు అనే ది ఫ్లాష్ బ్యాక్ లో రివిల్ చేస్తాడు. క‌థ ప‌రంగా , క‌థ‌నం ప‌రంగా కొన్ని లోపాలు ఉన్న‌ప్ప‌ట‌కి ఓవ‌రాల్ గా అర్ధ‌నారి చిత్రం బావుంద‌నిపిస్తుంది. హీరోగా చేసిన అర్జున్ య‌జ‌త్ కు మంచి పేరు వ‌చ్చిన‌ట్లే. మిగిలిన క్యారెక్ట‌ర్స్ అన్ని కొత్త వాళ్లు . ఒక్క ఫేస్ కూడా ఆడియ‌న్స్ కు ప‌రిచ‌యం ఉన్న‌ట్లు అనిపించ‌దు. కానీ కంటెంట్ లో వున్న టెంప‌ర్ మెంట్ సినిమా చూసేలా చేస్తుంది.

First Published:  2 July 2016 11:38 PM GMT
Next Story