Telugu Global
NEWS

నాగంకు త్రుటిలో త‌ప్పిన ప్ర‌మాదం!

బీజేపీ నేత నాగం జ‌నార్ద‌న్ రెడ్డికి త్రుటిలో ప్ర‌మాదం త‌ప్పింది. ఇంత‌కీ ఆయ‌న‌కేమైంది? అనుకుంటున్నారా? శ‌నివారం ఆయ‌న‌పై టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు దాడి చేయ‌బోయారు. పోలీసులు క‌ల‌గజేసుకోవ‌డంతో గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది. లేకుంటే  మ‌రోసారి నాగంపై దాడి జ‌రిగేదే! పాల‌మూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టులలో భారీగా అవినీతి జ‌రుగుతోందంటూ కొంత‌కాలంగా నాగం ప‌లుమార్లు కోర్టును ఆశ్ర‌యించారు. వ‌రుస‌గా కోర్టు ఆయ‌న అభ్యంత‌రాలను తోసిపుచ్చి పంపింది. అయినా.. నాగం తీరులో ఎలాంటి మార్పు రాలేదు. మ‌ళ్లీ అవే అవినీతి ఆరోప‌ణ‌లు […]

నాగంకు త్రుటిలో త‌ప్పిన ప్ర‌మాదం!
X
బీజేపీ నేత నాగం జ‌నార్ద‌న్ రెడ్డికి త్రుటిలో ప్ర‌మాదం త‌ప్పింది. ఇంత‌కీ ఆయ‌న‌కేమైంది? అనుకుంటున్నారా? శ‌నివారం ఆయ‌న‌పై టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు దాడి చేయ‌బోయారు. పోలీసులు క‌ల‌గజేసుకోవ‌డంతో గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది. లేకుంటే మ‌రోసారి నాగంపై దాడి జ‌రిగేదే! పాల‌మూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టులలో భారీగా అవినీతి జ‌రుగుతోందంటూ కొంత‌కాలంగా నాగం ప‌లుమార్లు కోర్టును ఆశ్ర‌యించారు. వ‌రుస‌గా కోర్టు ఆయ‌న అభ్యంత‌రాలను తోసిపుచ్చి పంపింది. అయినా.. నాగం తీరులో ఎలాంటి మార్పు రాలేదు. మ‌ళ్లీ అవే అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.
కోర్టు ఆయ‌న అర్జీలు తిర‌స్క‌రించినా.. నాగం ఇటీవ‌ల త‌న పాత పిటిష‌న్‌ను పున్ః ప‌రిశీలించాల‌ని మ‌రోసారి కోర్టును ఆశ్ర‌యించారు. ఇటీవ‌ల ఆరోప‌ణ‌ల‌పై స్వ‌రం పెంచారు. ఇదే అంశంపై మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లోని ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌజ్‌లో ఆయ‌న విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఇది తెలుసుకున్న టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హంతో అక్క‌డికి చేరుకున్నారు. నాగంపై దాడికి ప్ర‌య‌త్నించారు. ఈక్ర‌మంలో బీజేపీ – టీఆర్ ఎస్ నేత‌ల మ‌ధ్య తోపులాట జ‌రిగింది. వెంట‌నే క‌లుగ జేసుకున్న పోలీసులు వారిని అక్క‌డ నుంచి పంపేయ‌డంతో నాగం దాడి నుంచి త‌ప్పించుకోగ‌లిగారు..
ఉస్మానియా దాడితో నాగంలో మార్పు!
తెలంగాణ ఉద్య‌మం ఉగ్ర‌రూపంగా సాగుతోన్న క్ర‌మంలో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలంతా ఓయూలో దీక్ష చేస్తోన్న విద్యార్థుల వ‌ద్ద‌కు సంఘీభావం తెలిపేందుకు వెళ్లారు. అక్క‌డకి వెళ్లి.. చంద్ర‌బాబు రెండు క‌ళ్ల సిద్ధాంతాన్ని విద్యార్థుల‌కు వివ‌రించారు. అస‌లే తెలంగాణను చంద్ర‌బాబు అడ్డుకుంటున్నాడ‌న్న కోపంతో ఉన్న విద్యార్థుల‌కు నాగం మాట‌లతో అరికాలి మంట నెత్తికెక్కింది. నాగంతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలంద‌రినీ ఉతికి ఆరేశారు. దొరికిన‌వారిని దొరికిన‌ట్లు చావ‌బాదారు. ఈ దాడిలో నాగంకు బీపీ పెరిగిపోయి స్పృహ కోల్పోయారు. ఈదాడిలో టీడీపీ ఎమ్మెల్యేల వాహ‌నాలు ధ్వంసం చేశారు విద్యార్థులు. ప్ర‌జ‌ల్లో సెంటిమెంటు ఇంత బ‌లంగా ఉందా? అన్న విష‌యం ఈ దాడితోనే నాగంకు తెలిసివ‌చ్చిందంటారు ఓయూ విద్యార్థులు. అప్ప‌టి నుంచి తెలంగాణ బాట ప‌ట్టిన నాగం ఎంతోకాలం రెండు క‌ళ్ల బాబు వ‌ద్ద ఉండ‌లేక‌పోయారు. మ‌రోసారి తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా నాగం మాట్లాడుతుండ‌టం తెలంగాణ‌వాదులు, పాల‌మూరు ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌పై తీవ్ర ఆగ్ర‌హం క‌లిగిస్తున్నాయి. ఆయ‌న ఆరోప‌ణ‌ల్లో ప‌స లేద‌ని న్యాయ‌స్థానాలు తేలుస్తున్నా.. ఆయ‌న ప‌క్ష‌పాతంతో, అక్క‌సుతోనే ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని గులాబీనేత‌లు మండిప‌డుతున్నారు.

Click on Image to Read:

Chinna Jeeyar

nagachitanya-samantha

tdp-incharge

jagan-power-plant

kodela

buggana-rajendranath-reddy-

mla-raghurami-reddy

american-telugu-association

ysrcp MLA's

ramzan-thofa-ghee

chandrbabu-naidu

rgv

kurnool-kota

ap NCAER report

ktr twitter

jc-diwakar-reddy

First Published:  2 July 2016 10:13 PM GMT
Next Story