Telugu Global
Cinema & Entertainment

భ‌య పెడుతున్న త్రిష‌..

త్రిష విభిన్నంగా నటించిన ద్విభాష చిత్రం నాయకి. ఈ మూవీకి ఆకా గోవి (గోవర్ధన్ రెడ్డి) దర్శకుడు.. జులై ఎనిమిదో తేదిన తెలుగు, తమిళ భాషలో విడుదల కానుంది. దీంతో చిత్ర‌ టీమ్ ప్రమోషన్స్ పరంగా రంగంలోకి దిగింది. తెలుగు .. తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాను, ఒకేసారి రెండు భాషల్లోను విడుదల చేయనున్నారు. త్రిష మొదటిసారిగా చేస్తోన్న కథానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రం కావడం .. అందునా హారర్ థ్రిల్లర్ కావడం ప్రేక్షకుల్లో ఆసక్తిని […]

భ‌య పెడుతున్న త్రిష‌..
X

త్రిష విభిన్నంగా నటించిన ద్విభాష చిత్రం నాయకి. ఈ మూవీకి ఆకా గోవి (గోవర్ధన్ రెడ్డి) దర్శకుడు.. జులై ఎనిమిదో తేదిన తెలుగు, తమిళ భాషలో విడుదల కానుంది. దీంతో చిత్ర‌ టీమ్ ప్రమోషన్స్ పరంగా రంగంలోకి దిగింది. తెలుగు .. తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాను, ఒకేసారి రెండు భాషల్లోను విడుదల చేయనున్నారు. త్రిష మొదటిసారిగా చేస్తోన్న కథానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రం కావడం .. అందునా హారర్ థ్రిల్లర్ కావడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గిరిధర్ నిర్మాణంలో ‘గోవి’ తెరకెక్కించిన ఈ సినిమాపై త్రిష గట్టి నమ్మకమే పెట్టుకుంది. ఆమె పద్ధతిగా పట్టుచీర కట్టుకుని వరుస హత్యలు చేస్తూ వెళుతున్నట్టుగా వచ్చిన పోస్టర్స్, ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ సినిమాలో ఆమె దెయ్యంగా కనిపించనుందని అంటున్నారు.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో, మరోవార్త షికారు చేస్తోంది. ఈ సినిమాలో ఆమె దెయ్యంగా మారక మునుపు చాలా గ్లామర్ గా కనిపిస్తుందనీ, ఈ పాత్రలో త్రిష గ్లామర్ డోస్ బాగా పెంచేసిందనే టాక్ వినిపిస్తోంది.

First Published:  2 July 2016 11:23 PM GMT
Next Story