ఆర్టీసీ చైర్మన్‌ను చేస్తామని ఇప్పటికీ చేయలేదు… టార్గెట్ సాయిరెడ్డే

తెలుగు టీవీ ఛానల్‌ ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం పలు విషయాలు చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో తానను పోటీ చేయవద్దని చెప్పింది చంద్రబాబేనన్నారు. తనను జిల్లాలో పార్టీ కోసం పనిచేయాల్సిందిగా సూచించి తన కుమారుడికి టికెట్ ఇచ్చారని అన్నారు. కరణం బలరాం పని అయిపోయింది కాబట్టే గొట్టిపాటిని చంద్రబాబు టీడీపీలోకి తెచ్చారన్న ప్రచారంపై కరణం ఘాటుగా స్పందించారు. అలా ఎవరైనా అనుకుంటే అది వారి మూర్ఖత్వమేనన్నారు.

డ్యాన్స్‌ మాస్టర్లను తెచ్చిపెట్టుకుంటే ప్రయోజనం ఉండదన్నారు. వైసీపీ నుంచి వచ్చి వారు టీడీపీ కార్యకర్తలను కాపాడుతామంటే అంతకంటే తెలివితక్కువ తనం ఉంటుందాఅని ప్రశ్నించారు. మొన్న చంద్రబాబు మీటింగ్ పెడితే గొట్టిపాటి వర్గం నుంచి ఒక్కరు రాలేదు వచ్చినవారంతా  తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలేనని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఆర్టీసీ చైర్మన్‌ను చేస్తానని స్వయంగా చంద్రబాబే పిలిచి చెప్పారని కానీ ఇప్పటికీ అది జరగలేదన్నారు. పదవుల కోసం తాను పాకులాడేవ్యక్తిని కాదన్నారాయన. కాంగ్రెస్‌లో ఉండగా చంద్రబాబును మంత్రిని చేసేందుకు ఢిల్లీలో తాను ఏం చేశానో ఆయనకే తెలుసన్నారు. ఇందిరాగాంధీ తనను మూడో కుమారుడుగా భావిస్తున్నట్టుని బహిరంగవేదికపైనే ప్రకటించిందన్నారు.

తాను అనుకుని ఉంటే అప్పట్లోనే ఎన్నో పదవులు వచ్చేవన్నారు. పార్టీ ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించగా… రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో స్థానం గెలుచుకోవడం కోసమే ఆ పనిచేశారని చెప్పారు. ఇది ఆరోపణ కాదని జరిగిన వాస్తవం అని చెప్పారు. మరో 8 మంది ఎమ్మెల్యేలను తీసుకువచ్చి విజయసాయిరెడ్డిని ఓడించాలనుకున్నారని కరణం చెప్పారు. టార్గెట్ విజయసాయిరెడ్డిగానే ఫిరాయింపులను ప్రోత్సహించారని చెప్పారు. చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు మధ్య విబేధాలకు తాను బలయ్యానని కరణం చెప్పారు. భవిష్యత్తులో వైసీపీలో చేరుతారా అన్న ప్రశ్నకు మొత్తంమీద చంద్రబాబు తన పట్ల చూపుతున్న వివక్షపై కరణం బయటపడకపోయినా అసంతృప్తిగానేఉన్నట్టు అర్థమవుతోంది.

Click on Image to Read:

ata-2016-ysrcp-leaders speach

hero shivaji comments on chandrababu naidu

kavitha

bhuma-nagireddy

shiva swamy

mudragada

kesineni-nani

jaleel-khan-tdp

Gali-Muddu-Krishnama-Naidu

kanna-laxminarayana-vs--bud

Chinna Jeeyar

nagachitanya-samantha

tdp-incharge

jagan-power-plant

kodela

ramzan-thofa-ghee

kurnool-kota

ap NCAER report

jc-diwakar-reddy