Telugu Global
Cinema & Entertainment

కాబోయే భర్త తీసిన హాట్ ఫొటోలు

హీరోయిన్ అవకాశాల కోసం కొత్త ఎత్తు వేసింది ఇలియానా. హాట్ హాట్ ఫొటో షూట్ ను మార్కెట్లోకి వదిలింది. అయితే ఈ ఫొటో షూట్ ను కాబోయే భర్త తెరకెక్కించడం విశేషం. అమెరికాకు చెందిన స్టయిలిష్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో… ఇలియానా కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ విషయాన్ని ఆమె ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఆండ్రూను పెళ్లాడే ముందు తెలుగు, హిందీ భాషల్లో మరిన్ని సినిమాలు చేయాలని ఇలియానా భావిస్తోంది. అయితే ఈ […]

కాబోయే భర్త తీసిన హాట్ ఫొటోలు
X
హీరోయిన్ అవకాశాల కోసం కొత్త ఎత్తు వేసింది ఇలియానా. హాట్ హాట్ ఫొటో షూట్ ను మార్కెట్లోకి వదిలింది. అయితే ఈ ఫొటో షూట్ ను కాబోయే భర్త తెరకెక్కించడం విశేషం. అమెరికాకు చెందిన స్టయిలిష్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో… ఇలియానా కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ విషయాన్ని ఆమె ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఆండ్రూను పెళ్లాడే ముందు తెలుగు, హిందీ భాషల్లో మరిన్ని సినిమాలు చేయాలని ఇలియానా భావిస్తోంది. అయితే ఈ రెండు భాషల్లోనే కాకుండా… ఎక్కడా ఇలియానాకు అవకాశాలు అందడం లేదు. దీంతో హీటెక్కించే ఫొటోల్ని విడుదల చేయాలని డిసైడైంది ఈ భామ. ఇందులో భాగంగా హాట్ హాట్ గా ఫొటోలతో పోజులిచ్చింది. ఇదేదో మ్యాగజైన్ల కోసం ఇలియానా ఇచ్చిన ఫోజులు కాదు. తనకు తాను ఇష్టపూర్వకంగా ఇలియానా దిగిన ఫొటోలు. పైగా ఈ ఫొటోల్ని ఆమె కాబోయే ఆండ్రూ షూట్ చేయడం విశేషం. కనీసం ఈ ఫొటోలు చూసైనా ఇలియానాకు అవకాశాలు పెరుగుతాయేమో చూడాలి. ప్రస్తుతం ఈ భామ, అక్షయ్ కుమార్ హీరోగా నటించిన రుస్తుం సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. తాజాగా విడుదలైన ఈ ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే సినిమాలో ఇలియానా పాత్ర చాలా చిన్నదని టాక్.
Ileana-Latest-Photos 2 Ileana-Latest-Photos 3 Ileana-Latest-Photos 4
First Published:  5 July 2016 9:23 AM GMT
Next Story