Telugu Global
Cinema & Entertainment

హాస్పిటల్ లో చేరిన ఈగ విలన్

ప్రస్తుతం తెలుగు, కన్నడ నాట మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడిగా పేరుతెచ్చుకున్నాడు సుదీప్. తెలుగులో బాహుబలి లాంటి సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే… శాండిల్ వుడ్ లో రీమేక్ సినిమాలతో హల్ చల్ చేస్తున్నాడు. ప్రస్తుతం అక్కడ హెబ్బులి అనే సినిమా చేస్తున్నాడు సుదీప్. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా మరో షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉందనగా… సుదీప్ కు ఊహించని విధంగా జబ్బు చేసింది. షూటింగ్ […]

హాస్పిటల్ లో చేరిన ఈగ విలన్
X

ప్రస్తుతం తెలుగు, కన్నడ నాట మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడిగా పేరుతెచ్చుకున్నాడు సుదీప్. తెలుగులో బాహుబలి లాంటి సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే… శాండిల్ వుడ్ లో రీమేక్ సినిమాలతో హల్ చల్ చేస్తున్నాడు. ప్రస్తుతం అక్కడ హెబ్బులి అనే సినిమా చేస్తున్నాడు సుదీప్. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా మరో షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉందనగా… సుదీప్ కు ఊహించని విధంగా జబ్బు చేసింది. షూటింగ్ స్పాట్ లో ఉంటుండగానే తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడిన సుదీప్ ను… మైసూర్ లోని ఓ హాస్పిటల్ కు హుటాహుటిన తరలించారు. అన్ని టెస్టులు చేసిన డాక్టర్లు… సమస్య ఏంటనేది మాత్రం కనుక్కోలేకపోయారు. సుదీప్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, అతడు నటిస్తున్న సినిమా షూటింగ్ ను 5 రోజులు వాయిదా వేశారు. మరోవైపు ఈ హీరో… బాహుబలి-2లో కూడా నటించాల్సి ఉంది. మొదటి భాగంలో కట్టప్ప, సుదీప్ మధ్య సన్నివేశాలు వచ్చాయి. రెండో భాగంలో… సుదీప్, ప్రభాస్ మధ్య కీలక సన్నివేశాలు రానున్నాయి. ఆ షూటింగ్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది.

First Published:  5 July 2016 4:58 AM GMT
Next Story