సాక్షిపై కేసులు నమోదు…

తమ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిన సాక్షిమీడియాను చంద్రబాబు ప్రభుత్వం వదిలిపెట్టడం లేదు. రాజధాని దురాక్రమణపై కథనాలు రాశారంటూ అప్పట్లో సాక్షిపై కేసులు పెట్టి హడావుడి చేసిన ప్రభుత్వం తాజాగా ముద్రగడ దీక్ష విషయంలో సాక్షి పత్రికపై కేసులు నమోదు చేయించింది. ముద్రగడ దీక్ష చేస్తున్న సమయంలో వైద్యులు విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌కు విరుద్ధంగా వార్తలు ప్రచురించారంటూ సాక్షి పత్రికపై రాజమండ్రి పోలీసులు కేసులు నమోదు చేశారు. 14 రోజులు దీక్ష చేసినప్పటికీ ముద్రగడ ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ సాక్షి మాత్రం అందుకు విరుద్దంగా ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తోందంటూ కథనాలు ప్రసారం చేసిందన్నది ప్రభుత్వ ఆరోపణ. దీని వల్ల సమాజంలో లేనిపోని అశాంతి ఏర్పడిందని కేసు నమోదు చేశారు.

ఐపీసీ 153(ఏ) కింద సాక్షి ఎడిటర్, రెసిడెంట్‌ ఎడిటర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రేపోమాపో సాక్షిపత్రికకు నోటీసులు జారీచేయనున్నారు. అయితే సాక్షి టీవీ మీద కూడా కేసులు పెట్టాలని తొలుత భావించారు. కానీ ముద్రగడ దీక్ష సమయంలో సాక్షి ప్రసారాలను ప్రభుత్వమే నిలిపివేయించింది. ఆ విషయాన్ని మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, గంటా కూడా స్వయంగా వెల్లడించారు. దీంతో సాక్షి టీవీపై కేసులు నమోదు చేస్తే అభాసుపాలవుతామన్న ఉద్దేశంతో నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తోంది. కేసులను సాక్షి పత్రికకు పరిమితం చేసినట్టు తెలుస్తోంది.

Click on Image to Read:

kothapalli-subbarayudu

kcr-revanth-tdp

babu

nimmagadda-prasad

buddha venkanna

swis-chalenge

kamalananda bharati

bhumanagireddy

shiva-swamy

parvtha-purna-chandra-prasa

hero shivaji comments on chandrababu naidu

chandrababu-temples-revomei

ata-2016-ysrcp-leaders speach

karanam-balaram