ఐసీస్ పై  పోరాటానికి బాహుబ‌లి!

త‌న వికృత‌, ఉన్మాద చ‌ర్య‌ల‌తో ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోన్న ఉగ్ర‌వాద సంస్థ ఐ ఎస్ ఐఎస్ అంతుచూసేందుకు కొత్త ఆయుధం తెర‌పైకి వ‌చ్చింది. ఆయుధమంటే పేల్చేది కాదు.. అవ‌త‌లి మ‌నుషుల‌ను నిలువునా కుప్ప‌కూల్చే భారీకాయుడు. ఇరాన్ బుల్డోజ‌ర్‌గా పిలుచుకునే ఈ కండ‌ల‌వీరుడు శ‌త్రువుల‌ను భుజాల్లో వేసి న‌లిపేస్తాడు. ఇత‌ని పంచ్ బ‌రువు వంద కిలోల‌పైమాటే. ఇత‌ని చేతిలో ఒక్క‌సారి దెబ్బ తిన్న‌వారు దాన్ని గుర్తుంచుకోలేరు. ఎందుకంటే.. వారు బ‌తికి ఉండే అవ‌కాశాలు త‌క్కువ‌. ఇరాక్ కు చెందిన ఇత‌ని పేరు సాజిద్‌. వ‌య‌సు 24 ఇత‌న్ని అక్క‌డివారు హ‌ల్క్‌, అని బుల్డోజ‌ర్ అని పిలుస్తారు. 150 కిలోలున్న సాజిద్ 180 కిలోల బ‌రువును అమాంతం ఎత్తి అవ‌త‌ల పారేయ‌గ‌ల‌డు. త‌న దేశాన్ని నాశ‌నం చేస్తోన్న ఐసీస్ ను తుద‌ముట్టించేందుకు రంగంలోకి దిగుతాన‌ని సాజిద్ ప్ర‌క‌టించాడు. 
 
సాజిద్ ప్ర‌క‌ట‌న‌ల‌పై ప‌లువురు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఐఎస్ ఐ ఎస్‌లోనూ బంధీల త‌ల‌ల‌ను క్రూరంగా కోసి అవ‌త‌ల పారేసే.. ఓ భారీ కాయుడి పేరు కూడా ది బుల్డోజ‌ర్ కావ‌డం విశేషం. కాక‌పోతే అత‌ను ముఖానికి ముసుగు ధ‌రించి ఉంటాడు. చూసేందుకు ఒకేలా ఉండే ఈ ఇద్ద‌రూ ఒక్క‌రేన‌ని ప‌లువురు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఆరోప‌ణ‌ల‌ను సాజిద్ లెక్క చేయ‌డం లేదు. త‌న దేశానికి చీడ‌లా దాపురించిన ఐసీస్‌ పై తాను యుద్ధం చేసి తీరుతాన‌ని ప్ర‌తిన బూనుతున్నాడు.