Telugu Global
National

శాంతి యోధుడు రమేశ్ చంద్ర కన్నుమూత

దశాబ్దాల తరబడి ప్రపంచ శాంతి కోసం పాటుబడ్డ రమేశ్ చంద్ర కన్ను మూశారు. ఆయనకు 97 ఏళ్లు. 1952 నుంచి 1963 దాకా ఆయన అఖిలభారత శాంతి సంఘం ప్రధాకార్యదర్శిగా పని చేసి 1966లో ప్రపంచ శాంతి సంఘం ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1977లో ప్రపంచ శాంతి సంఘం అధ్యక్షులయ్యారు. ప్రపంచ శాంతి సంఘాన్ని సామ్రాజ్య వాద వ్యతిరేక వేదికగా మలచడంలో రమేశ్ చంద్ర నిర్వహించిన పాత్ర అమోఘమైంది. 2000 సంవత్సరంలో ఆయన్ను ప్రపంచ శాంతి సంఘం గౌరవాధ్యక్షులుగా […]

శాంతి యోధుడు రమేశ్ చంద్ర కన్నుమూత
X

దశాబ్దాల తరబడి ప్రపంచ శాంతి కోసం పాటుబడ్డ రమేశ్ చంద్ర కన్ను మూశారు. ఆయనకు 97 ఏళ్లు. 1952 నుంచి 1963 దాకా ఆయన అఖిలభారత శాంతి సంఘం ప్రధాకార్యదర్శిగా పని చేసి 1966లో ప్రపంచ శాంతి సంఘం ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1977లో ప్రపంచ శాంతి సంఘం అధ్యక్షులయ్యారు. ప్రపంచ శాంతి సంఘాన్ని సామ్రాజ్య వాద వ్యతిరేక వేదికగా మలచడంలో రమేశ్ చంద్ర నిర్వహించిన పాత్ర అమోఘమైంది. 2000 సంవత్సరంలో ఆయన్ను ప్రపంచ శాంతి సంఘం గౌరవాధ్యక్షులుగా నియమించారు. అప్పటి నుంచి ఆయన అదే హోదాలో కొనసాగుతున్నారు.

ప్రజా పోరాటాలకు మద్దతు ఇవ్వడంలోనూ, నియంతృత్వ పాలన కింద మగ్గుతున్న దేశాల వారికి సంఘీభావం తెలియజేయడంలోనూ ఆయన అద్వితీయమైన పాత్ర పోషించారు. ప్రపంచ వ్యాప్తంగా డజన్ల కొద్దీ దేశాల విమోచన పోరాటాల్లో ఆయన పాత్ర ఉంది. ఆయన నిఖార్సైన అంతర్జాతీయతా వాది. కాని తన విప్లవ భావాల విషయంలో ఎన్నడూ రాజీ పడలేదు.

1919 మార్చి 30న లైల్పూర్లో జన్మించిన రమేశ్ చంద్ర లాహోర్ యూనివర్సిటీలో ఆ తర్వాత కేంబ్రిద్జి యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశారు. 1934 నుంచి 1941 వరకు లాహోర్ విద్యార్థి సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. విద్యార్థిగా ఉండగానే ఆయన వామపక్ష రాజకీయాలవైపు ఆకర్శితుడై చివరి దాకా భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) లో కొనసాగారు. 1939లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. 1958లో సీపీఐ జాతీయ సమితి సభుడిగా, 1963 నుంచి 1967 దాకా సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా కొనసాగారు. 1963 నుంచి 1966 దాకా సీపీఐ అధికార పత్రిక “న్యూ ఏజ్” సంపాదకులుగా వ్యవహరించారు.

First Published:  5 July 2016 3:03 AM GMT
Next Story