కొత్తపల్లి వ్యాల్యూ మూడు నిమిషాలేనా?

కొత్తపల్లి సుబ్బారాయుడు. పశ్చిమగోదావరి జిల్లాలో ఒకప్పుడు చక్రం తిప్పిన నాయకుడు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత పీఆర్పీని నమ్ముకుని టీడీపీని వదిలేశారు. అప్పటి నుంచి ఆయన రాజకీయం మినుకుమినుకుమంటూనే సాగుతోంది. పీఆర్పీతో పాటు కాంగ్రెస్‌లోకి వచ్చి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో నరసాపురంనుంచి గెలిచారు. అనంతరం ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. అక్కడ ఓడిపోయారు. అయినా సరే జగన్ ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి అప్పగించారు. కానీ అప్పటికే అధికారానికి దూరమై చాలాకాలమవడంతో పాత పరిచయాలతో టీడీపీలోకి వెళ్లిపోయారు. అయితే అధికారం అనుభవించుదామని వెళ్లిన ఆయనకు పార్టీలో అడుగడుగున అవమానాలే ఎదురవుతున్నాయట.

నరసాపురం టీడీపీ ఎమ్మేల్యే మాధవనాయుడు … ఎలాగైనా కొత్తపల్లిని బలహీనపరచాలన్న ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తపల్లి రాకను ఇష్టపడని జిల్లా ఇతర నాయకులు కూడా మాధవనాయుడికి సహకారం అందిస్తున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ టీడీపీలోకి వచ్చాను కాబట్టి మంచి మర్యాదే దక్కుతుందనుకున్న కొత్తపల్లికి ఈ పరిణామాలు రుచించడం లేదు. ఇటీవల ఏరువాక కార్యక్రమం ద్వారా టీడీపీలో ప్రస్తుతం తన వ్యాల్యూ ఎంతో కొత్తపల్లి సుబ్బారాయుడికి ఒక అంచనా వచ్చిందని చెబుతున్నారు.

ఒక సీనియర్ నాయకుడిగా ఏరువాక కార్యక్రమంలో, చంద్రబాబు సమక్షంలో సుదీర్ఘంగా మాట్లాడాలని కొత్తపల్లి భావించారట. కానీ జిల్లా నాయకత్వమంతా కలిసి కొత్తపల్లిని ఒకవిధంగా అవమానించింది. ఎమ్మెల్యే మాధవనాయుడికి 15 నిమిషాల పాటు మాట్లాడాల్సిందిగా అవకాశం ఇచ్చింది పార్టీ నాయకత్వం. తీరా కొత్తపల్లి మాట్లాడేందుకు సిద్ధమవగా కేవలం మూడు నిమిషాల్లోనే ప్రసంగం ముగించాల్సిందిగా తేల్చేశారట. దీంతో సుబ్బారాయుడు తీవ్ర అవమానంగా భావించారు. ఇంత సీనియర్ నేతనైన తన విలువ మూడు నిమిషాలా అని సన్నిహితుల వద్ద వాపోయారట. అంతే మరి అధికారం అనే గులాబీ చుట్టూ ముళ్లూ ఉంటాయి. గులాబీని మాత్రమే చూసి టక్కున వెళ్లి తీసేసుకోవాలంటే ఇలాంటి ముళ్లే గుచ్చుకుంటాయి.

Click on Image to Read:

ktr-chandrababu-naidu

kcr-revanth-tdp

babu

nimmagadda-prasad

buddha venkanna

swis-chalenge

kamalananda bharati

bhumanagireddy

shiva-swamy

parvtha-purna-chandra-prasa

hero shivaji comments on chandrababu naidu

chandrababu-temples-revomei

ata-2016-ysrcp-leaders speach

karanam-balaram