సుల్తాన్  ఎలా ఉందంటే..?

మల్లయోధుడిగా సల్మాన్‌ఖాన్‌.. మల్లయోధురాలిగా అనుష్కశర్మ రింగులో ప్రత్యర్థులను ఓడించే తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్‌లోని సన్నివేశాలు ప్రేక్షకులను సీటు నుంచి కదలకుండా చేస్తాయి. సెకండాఫ్‌లో పోరాట సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నా కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో సుల్తాన్‌ కింగ్‌ ఆఫ్‌ ది రింగ్‌ అనిపించుకునే సన్నివేశాలు అందరినీ ఆలోచింపజేస్తాయి. సుల్తాన్‌ అంతర్జాతీయ స్థాయిలో ఛాంపియన్‌గా నిలిచిన సమయంలోనే ఆర్ఫా మగబిడ్డకు జన్మనివ్వడం.. కొద్ది సమయానికే బిడ్డ మరణించడం అందరి హృదయాలను కలచివేస్తుంది.

ఎవరెలా?
మల్లయోధుడిగా సల్మాన్‌ అభిమానులకు చక్కటి అనుభూతిని కలిగించారు.ప్రత్యర్థులను ఓడించేందుకు కాదు.. నాపై నేను విజయం సాధించేందుకే నా పట్టుదల అంటూ ఆత్మవిశ్వాసంతో హీరో చెప్పే మాటలు సందేశాత్మకంగా ఉంటాయి. అనుష్కశర్మ మల్లయోధురాలిగా తక్కువ సమయమే కనిపించినా అందరినీ ఆకట్టుకుంటుంది. సుల్తాన్‌కు రెజ్లింగ్‌ కోచ్‌గా రణ్‌దీప్‌ హుడా తన పరిధిలో బాగా నటించాడు. రణ్‌దీప్‌ పాత్ర ప్రాధాన్యతను మరింత పెంచితే బాగుండేదనిపిస్తుంది. మిగతా నటులు తమ పరిధి మేర మెప్పించారు. నేపథ్య సంగీతం.. స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంది. ఓవ‌రాల్ గా సినిమా  సూప‌ర్ హిట్ అయ్యే అవ‌కాశాలున్నాయ‌నేది అభిమానుల మాట‌.