Telugu Global
NEWS

ల‌క్ష్మ‌ణ్‌కు ఉగ్ర‌వాదుల నుంచి ప్రాణ‌హాని ?

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ముషీరాబాద్ ఎమ్మెల్యే కె.ల‌క్ష్మ‌ణ్‌కు ప్ర‌భుత్వం భ‌ద్ర‌త‌ పెంచింది. న‌గరంలో ఇటీవ‌ల ఉగ్ర‌వాదుల క‌ద‌లిక‌లు పెరిగిన నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఈమేర‌కు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందులో భాగంగా ఆయ‌న‌కు పోలీసు ర‌క్ష‌ణ‌ను రెట్టింపు చేసింది. ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నాన్ని సైతం కేటాయించింది. ఇదంతా నిఘా సంస్థ‌లు ఇచ్చిన స‌మాచారంతోనే జ‌రిగింద‌ని తెలిసింది. న‌గ‌రంలో ప‌లుచోట్ల భారీ విధ్వంస‌మే ల‌క్ష్యంగా ఐఎస్ సానుభూతి ప‌రులు న‌ర‌మేథానికి ప‌న్నిన కుట్ర గ‌త‌వారం భ‌గ్న‌మైన సంగ‌తి […]

ల‌క్ష్మ‌ణ్‌కు ఉగ్ర‌వాదుల నుంచి ప్రాణ‌హాని ?
X
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ముషీరాబాద్ ఎమ్మెల్యే కె.ల‌క్ష్మ‌ణ్‌కు ప్ర‌భుత్వం భ‌ద్ర‌త‌ పెంచింది. న‌గరంలో ఇటీవ‌ల ఉగ్ర‌వాదుల క‌ద‌లిక‌లు పెరిగిన నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఈమేర‌కు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందులో భాగంగా ఆయ‌న‌కు పోలీసు ర‌క్ష‌ణ‌ను రెట్టింపు చేసింది. ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నాన్ని సైతం కేటాయించింది. ఇదంతా నిఘా సంస్థ‌లు ఇచ్చిన స‌మాచారంతోనే జ‌రిగింద‌ని తెలిసింది. న‌గ‌రంలో ప‌లుచోట్ల భారీ విధ్వంస‌మే ల‌క్ష్యంగా ఐఎస్ సానుభూతి ప‌రులు న‌ర‌మేథానికి ప‌న్నిన కుట్ర గ‌త‌వారం భ‌గ్న‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ ఉగ్ర‌వాదులు కొంద‌రు బీజేపీ నేత‌ల‌ను సైతం టార్గెట్ గా పెట్టుకున్న‌ట్లు తెలిసింది.
కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ క‌స్ట‌డీలో ఉన్న అనుమానిత ఉగ్ర‌వాదులు చెప్పిన స‌మాచారంతో హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారం మ‌రోసారి సోదాలు నిర్వ‌హించారు పోలీసులు. ఈదాడిలో 17 బుల్లెట్లు, సిరియాలో ఉన్న ఉగ్ర‌నేత ఆర్మ‌ర్ ను సంప్ర‌దించేందుకు వాడిన కంప్యూట‌ర్ త‌దిత‌రాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదే స‌మ‌యంలో ఉగ్ర‌వాదులు న‌గ‌రంలోని కొంద‌రు నేత‌ల‌ను కూడా త‌మ హిట్‌లిస్టులో పెట్టుకున్నార‌ని, వారిని మ‌ట్టు పెట్టాల‌న్నది వారి ప‌థ‌కంలో భాగ‌మ‌ని తెలుసుకున్న పోలీసులు ఈ మేర‌కు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు ప్రారంభించారు. అందుకే, కాషాయ‌నాథుల పార్టీగా చెప్పుకునే బీజేపీ నేత‌లకు ప్ర‌భుత్వం ర‌క్ష‌ణ పెంచింది. డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్‌కు ముప్పు ఎక్కువ‌గా ఉన్నందునే, ఆయ‌న‌కు బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నం కేటాయించిన‌ట్లు స‌మాచారం. గ‌తంలోనూ బీజేపీ నేత‌ల ఇంటి వ‌ద్ద ప‌లువురు అనుమానితులు రెక్కీ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఐఎస్ సానుభూతి ప‌రులు ఈ సారి దేశంలో భారీ విధ్వంసాన్ని త‌ల‌పెట్ట‌డంతో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి.
First Published:  5 July 2016 10:08 PM GMT
Next Story