Telugu Global
Cinema & Entertainment

ఐదేళ్ల తర్వాత మరోసారి తెరపైకి హాట్ జోడీ

 తెలుగులో సీతమ్మగా అందరికీ పరిచయమైన అంజలి తమిళనాట కూడా పాపులర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈమె వ్యక్తిగత విషయాలపై చాలా పుకార్లు వినిపిస్తుంటాయి. కానీ ఎప్పటికప్పుడు అంజలి వాటిని ఖండిస్తూ వస్తోంది. తాజాగా ఆమెపై మరో పుకారు కూడా చెలరేగింది. తమిళనటుడు జై తో ఆమె డేటింగ్ చేస్తోందంటూ వార్తలువస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనే విషయాన్ని పక్కనపెడితే… ఆ హీరోతో మాత్రం మరో సినిమాకు కమిట్ అయింది అంజలి. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ […]

ఐదేళ్ల తర్వాత మరోసారి తెరపైకి హాట్ జోడీ
X

తెలుగులో సీతమ్మగా అందరికీ పరిచయమైన అంజలి తమిళనాట కూడా పాపులర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈమె వ్యక్తిగత విషయాలపై చాలా పుకార్లు వినిపిస్తుంటాయి. కానీ ఎప్పటికప్పుడు అంజలి వాటిని ఖండిస్తూ వస్తోంది. తాజాగా ఆమెపై మరో పుకారు కూడా చెలరేగింది. తమిళనటుడు జై తో ఆమె డేటింగ్ చేస్తోందంటూ వార్తలువస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనే విషయాన్ని పక్కనపెడితే… ఆ హీరోతో మాత్రం మరో సినిమాకు కమిట్ అయింది అంజలి. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఐదేళ్ల కిందట సూపర్ హిట్ సినిమా జర్నీ వచ్చింది. మళ్లీ ఇన్నేళ్లకు జై-అంజలి కలిసి మరో సినిమా చేస్తున్నాడు. తమిళ దర్శకుడు శినీష్ ఈ జంటను విజయవంతంగా కలపగలిగాడు. రొమాంటిక్ హారర్ సినిమాగా రాబోతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. ఈ విషయాన్ని అంజలి స్వయంగా వెల్లడించింది. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జైతో కలిసి నటించడం ఆనందంగా ఉందని తెలిపిన అంజలి… ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తోంది. తెలుగు-తమిళ భాషల్లో అంజలి కెరీర్ ప్రస్తుతం స్లోగా నడుస్తోంది. కనీసం తనకు అచ్చొచ్చిన జై తోనైనా హిట్ కొట్టాలని సీతమ్మ భావిస్తోంది.

First Published:  7 July 2016 3:55 AM GMT
Next Story