Telugu Global
NEWS

నడిరోడ్డుపై నిలబడి తిడుతా... జాగ్రత్త

మంత్రి కానినేని శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు. కృష్ణా జిల్లా కైకలూరులో జిల్లా అధ్యక్షుడు పార్థసారథితో కలిసి పర్యటించిన కొడాలి నాని… స్థానిక ఎమ్మెల్యే అయిన కామినేని తీరును తప్పుపట్టారు. చంద్రబాబు మెప్పుకోసం జగన్‌పై ఇష్టానుసారం నోరుపారేసుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. జగన్‌పై మరోసారి కామినేని నోరుపారేసుకుంటే తాను వయసులో చిన్నవాడినైనప్పటికీ కైకలూరులో నడిరోడ్డుపై నిలబడి కామినేనిని తిట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. పరిస్థితి అంతదూరం తెచ్చుకోవద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో కామినేని […]

నడిరోడ్డుపై నిలబడి తిడుతా... జాగ్రత్త
X

మంత్రి కానినేని శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు. కృష్ణా జిల్లా కైకలూరులో జిల్లా అధ్యక్షుడు పార్థసారథితో కలిసి పర్యటించిన కొడాలి నాని… స్థానిక ఎమ్మెల్యే అయిన కామినేని తీరును తప్పుపట్టారు. చంద్రబాబు మెప్పుకోసం జగన్‌పై ఇష్టానుసారం నోరుపారేసుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. జగన్‌పై మరోసారి కామినేని నోరుపారేసుకుంటే తాను వయసులో చిన్నవాడినైనప్పటికీ కైకలూరులో నడిరోడ్డుపై నిలబడి కామినేనిని తిట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. పరిస్థితి అంతదూరం తెచ్చుకోవద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో కామినేని ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటారని… అయితే ఇక్కడ గెలిచేది మాత్రం వైసీపీయేనని కొడాలి అన్నారు.

చిన్నపిల్లలు ఎక్కడైనా అనారోగ్యంతో చనిపోవడం చూస్తుంటామని కానీ చీమలు, ఎలుకలు కరిచి చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మాత్రం ఏపీలోనే జరుగుతుంటాయన్నారు. అందుకు మంత్రి కామినేని పనితీరే కారణమని పార్థసారథి మండిపడ్డారు.

Click on Image to Read:

chandrababu-times-of-india-

jagan

babu-computer

chandrababu-naidu

devineni-uma

garikapati

lokesh

garikapati narasimha rao

paruchuri-brothers-chandrab

venkaiah naidu

pattiseema

Byreddy-Rajashekar-Reddy

niti-aayog-andhra-pradesh

manikyala-rao

sailajanath,-chandrababu-na

ata-2016-ysrcp-leaders speach

First Published:  6 July 2016 11:13 PM GMT
Next Story