Telugu Global
Cinema & Entertainment

మహేష్ బాబు డబుల్ ఫొటో...

కొొందరు కొన్ని పాత్రలు పోషిస్తే అభిమానుల ఆనందానికి హద్దు ఉండవు. కలల్లో మాత్రమే ఊహించుకుంటూ ఉంటారు అలాంటి పాత్రల్ని. మహేష్ బాబు విషయంలో కూడా అలాంటి ఓ పాత్ర ఉంది. మామూలుగా 70mm స్క్రీన్ పై ఒక్క మహేష్ బాబుని చూస్తేనే అమ్మాయిలు ఆగలేరు. అలాంటిది ఒకే తెరపై ఇద్దరు మహేష్ బాబులు కనిపిస్తే ఎలా ఉంటుంది… ఊహించుకుంటనే మతిపోయే ఈ కలలాంటి అనుభూతి త్వరలోనే నిజం కాబోతోంది. అవును… త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న మురుగదాస్ […]

మహేష్ బాబు డబుల్ ఫొటో...
X

కొొందరు కొన్ని పాత్రలు పోషిస్తే అభిమానుల ఆనందానికి హద్దు ఉండవు. కలల్లో మాత్రమే ఊహించుకుంటూ ఉంటారు అలాంటి పాత్రల్ని. మహేష్ బాబు విషయంలో కూడా అలాంటి ఓ పాత్ర ఉంది. మామూలుగా 70mm స్క్రీన్ పై ఒక్క మహేష్ బాబుని చూస్తేనే అమ్మాయిలు ఆగలేరు. అలాంటిది ఒకే తెరపై ఇద్దరు మహేష్ బాబులు కనిపిస్తే ఎలా ఉంటుంది… ఊహించుకుంటనే మతిపోయే ఈ కలలాంటి అనుభూతి త్వరలోనే నిజం కాబోతోంది. అవును… త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న మురుగదాస్ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తాడట.

ప్రిన్స్ మహేష్ బాబు బాలనటుడుగా ఉన్న సమయంలో ద్విపాత్రాభినయం చేశాడు.. హీరోగా మారిన తర్వాత ఇప్పటి వరకూ పూర్తి స్థాయిలో రెండు గెటప్పుల్లో కనిపించలేదు. మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో మాత్రం మహేష్ డ్యూయల్ రోల్ చేస్తాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 29 నుంచి ప్రారంభం కానుంది. 110 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు రెండు పాత్రల్లో కనిపిస్తాడట… ఇంటలిజెంట్ అధికారిగా, ప్రొఫెసర్ గా రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడనే ప్రచారం సాగుతోంది. మహేష్ బాబు కూడా డ్యూయల్ రోల్ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట. పరిణితి చోప్రా హీరోయిన్ గా ఎస్.జె.సూర్య విలన్ గా నటించనున్నారు.

First Published:  7 July 2016 4:25 AM GMT
Next Story