Telugu Global
Cinema & Entertainment

ఈసారి సరైనోడు లెక్కలు సరైనవే...

సరైనోడు సినిమాను దగ్గరుండి మెగాభిమానులంతా కలిసి హిట్ చేశారు. అలా స్టార్టింగ్ లో  ఫ్లాప్ టాక్ తో ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం కలెక్షన్ల పరంగా టాప్-5 తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది. దీంతో అల్లు అర్జున్ విజయాల జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. సమ్మర్ సెలవుల్ని క్యాష్ చేసుకోవడం… పక్కాగా ప్రమోషన్ కల్పించడం… మరో సినిమా పోటీ లేకుండా చూసుకోవడం… కీలకమైన థియేటర్లను మేనేజ్ చేయడం… ఇలా నిర్మాత అల్లు అరవింద్ తన మాస్టర్ బ్రెయిన్ మొత్తం […]

ఈసారి సరైనోడు లెక్కలు సరైనవే...
X

సరైనోడు సినిమాను దగ్గరుండి మెగాభిమానులంతా కలిసి హిట్ చేశారు. అలా స్టార్టింగ్ లో ఫ్లాప్ టాక్ తో ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం కలెక్షన్ల పరంగా టాప్-5 తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది. దీంతో అల్లు అర్జున్ విజయాల జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. సమ్మర్ సెలవుల్ని క్యాష్ చేసుకోవడం… పక్కాగా ప్రమోషన్ కల్పించడం… మరో సినిమా పోటీ లేకుండా చూసుకోవడం… కీలకమైన థియేటర్లను మేనేజ్ చేయడం… ఇలా నిర్మాత అల్లు అరవింద్ తన మాస్టర్ బ్రెయిన్ మొత్తం ఉపయోగించి సరైనోడు సినిమాను విజయతీరాలకు చేర్చారు. సినిమా ఫైనల్ రన్ కూడా పూర్తవ్వడంతో మేకర్స్ అధికారికంగా సరైనోడు లెక్కల్ని విడుదల చేశారు.

నైజాం : రూ. 19.5 కోట్లు
సీడెడ్ : రూ. 10.9 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ. 8.20 కోట్లు
ఈస్ట్ : రూ. 5.35 కోట్లు
వెస్ట్ : రూ. 4.7 కోట్లు
కృష్ణా : రూ. 4.1 కోట్లు
గుంటూరు : రూ. 5.6 కోట్లు
నెల్లూరు : రూ. 2.45 కోట్లు

ఏపీ + నైజాం : రూ. 60.8 కోట్లు

కర్ణాటక : రూ. 7.31 కోట్లు
కేరళ : రూ. 2.8 కోట్లు
ఉత్తర భారతదేశం : రూ. 1.37 కోట్లు
అమెరికా : రూ. 2.92 కోట్లు
ఇతర దేశాలన్నీ కలిపి : రూ. 0.80 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు : రూ. 76 కోట్లు (సుమారుగా)

First Published:  7 July 2016 4:21 AM GMT
Next Story