Telugu Global
NEWS

పార్ల‌మెంటులో టీఆర్ ఎస్ వ్యూహం ఫ‌లిస్తుందా?

హైకోర్టు విభ‌జ‌న అంశం ముదిరి పాకాన పడే స‌మ‌యం ద‌గ్గ‌రికొచ్చిన‌ట్లే క‌నిపిస్తోంది. తెలంగాణ విష‌యంలో కేంద్రం స‌వతి త‌ల్లి ప్రేమ‌ను క‌న‌బ‌రుస్తోంద‌న్న అప‌వాదు ఇప్ప‌టికే ఉంది. తాజాగా హైకోర్టు విభ‌జ‌న విష‌యంలో బీజేపీని పార్ల‌మెంటు సాక్షిగా నిల‌దీసేందుకు తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎంపీలు సిద్ధ‌మ‌వుతున్నారు. పార్ల‌మెంటులో  ఈ అంశంపై ఉభ‌య‌ స‌భ‌ల‌ను స్తంభింప‌జేయాల‌ని వ్యూహాలు ర‌చిస్తోంది. ఫ‌లితంగా ఒకేస‌మ‌యంలో ఇటు తెలుగుదేశాన్ని, అటు కేంద్రాన్ని ఇరుకున పెట్టాల‌న్న‌ది టీఆర్ ఎస్ ప్లాన్‌గా క‌నిపిస్తోంది. ఈసారి పార్ల‌మెంటులో టీఆర్ […]

పార్ల‌మెంటులో టీఆర్ ఎస్ వ్యూహం ఫ‌లిస్తుందా?
X
హైకోర్టు విభ‌జ‌న అంశం ముదిరి పాకాన పడే స‌మ‌యం ద‌గ్గ‌రికొచ్చిన‌ట్లే క‌నిపిస్తోంది. తెలంగాణ విష‌యంలో కేంద్రం స‌వతి త‌ల్లి ప్రేమ‌ను క‌న‌బ‌రుస్తోంద‌న్న అప‌వాదు ఇప్ప‌టికే ఉంది. తాజాగా హైకోర్టు విభ‌జ‌న విష‌యంలో బీజేపీని పార్ల‌మెంటు సాక్షిగా నిల‌దీసేందుకు తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎంపీలు సిద్ధ‌మ‌వుతున్నారు. పార్ల‌మెంటులో ఈ అంశంపై ఉభ‌య‌ స‌భ‌ల‌ను స్తంభింప‌జేయాల‌ని వ్యూహాలు ర‌చిస్తోంది. ఫ‌లితంగా ఒకేస‌మ‌యంలో ఇటు తెలుగుదేశాన్ని, అటు కేంద్రాన్ని ఇరుకున పెట్టాల‌న్న‌ది టీఆర్ ఎస్ ప్లాన్‌గా క‌నిపిస్తోంది.
ఈసారి పార్ల‌మెంటులో టీఆర్ ఎస్ – టీడీపీ – బీజేపీ త్ర‌యాల మ‌ధ్య మాట‌ల యుద్ధం అనివార్యం అయ్యేలా ఉంది. తెలంగాణ‌కు అన్ని విష‌యాల్లో కేంద్రం స‌రిగా స‌హ‌క‌రించ‌డం లేద‌ని మొద‌టి నుంచి వాదిస్తూ వ‌స్తోన్న గులాబీపార్టీ రాష్ట్ర విభ‌జ‌న పూర్త‌యి రెండేళ్లు అవుతున్నా.. ఇంకా హైకోర్టు విభ‌జ‌న అంశాన్ని తేల్చ‌క‌పోవ‌డాన్ని ఈసారి ఎక్కువ‌గా ఫోక‌స్ చేయ‌నుంది. ఈ నెల 18 నుంచి జ‌రిగే పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లో.. జీఎస్టీతోపాటు ప‌లు కీల‌క బిల్లుల ఆమోదానికి బీజేపీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఉభ‌య స‌భ‌ల్లో క‌లిపి టీఆర్ ఎస్‌కు 17 మంది ఎంపీలు (ఇత‌ర‌పార్టీల‌తో చేరిన‌వారిని క‌లుపుకొని) ఉన్నారు. వీరివి మొత్తం 17 ఓట్లు. కాబ‌ట్టి గులాబీ పార్టిని లైట్ తీసుకోదు. ఇత‌ర పార్టీల అండ ఉంది కాబట్టి, లైట్ తీసుకున్నా ఆశ్చ‌ర్యం లేదు. ఈ విష‌యంలో చాయిస్ బీజేపీదే!
హైకోర్టు విభ‌జ‌న అంశాన్ని కేంద్రం ఏపీ సీఎం ప‌రిధిలోకి నెట్టి దాటవేసే ప్ర‌య‌త్నం చేద్దామ‌నే వ్యూహంలో ఎప్ప‌టినుంచో ఉంది. కానీ, ఈసారి గులాబీ పార్టీ నేత‌లు ఈ విష‌యాన్ని తేలిగ్గా వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు. గ‌తంలో బీజేపీ మూడు రాష్ర్టాల‌ను విభ‌జించిన‌పుడు హైకోర్టును వాటితో పాటే ఏర్పాటు చేసిన విష‌యాన్ని లేవ‌నెత్తునున్నారు. దీనికితోడు ఈ అంశంపై మాకు సంబంధం లేదంటూ వాదిస్తూ వ‌చ్చిన కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి స‌దానంద గౌడ్ శాఖ ఈసారి మారింది. మ‌రి కొత్త మంత్రి గారు దీనిపై ఎలాంటి స‌మాధానం ఇస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. మొత్తానికి హైకోర్టు విభ‌జ‌న విష‌యంలో ఈసారి టీఆర్ ఎస్ ఎంపీల నిర‌స‌న‌లు, స‌స్పెన్ష‌న్‌ల‌తో ఉభ‌య‌సభ‌లు హోరెత్త‌నున్నాయి. వీరికి కాంగ్రెస్ స‌భ్యుల మ‌ద్దతు ఎలాగూ ఉంటుంది. మ‌రి బీజేపీ దీనిపై స‌మాధానం ఇస్తుందా? ఏపీపైనే భారం వేసి చేతులు దులుపుకొంటుందా? అన్న‌ది వేచిచూడాల్సిందే!
First Published:  6 July 2016 9:19 PM GMT
Next Story